పినపాక నియోజకవర్గ ప్రాథమిక కేంద్రాల పై జిల్లా వైద్యాధికారి శీత కన్ను

ప్రాథమిక కేంద్రాలకు ఒక్కొక్క వైదున్ని కేటాయింపు.
జిల్లా కేంద్రం లో ప్రాధన్య లేని పోస్టు లో రెగ్యులర్ వైద్యులు తిష్ట.
ఐటీడీఏ పీవో ఆదేశాలు బుట్ట దాఖలు
పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా వైద్యుల కోరత వేధిస్తోంది. ప్రజాప్రతినిధులు వినతులు ఇచ్చిన ఆ అధికారి చెవిన పెట్టడం లేదు. సాక్షాత్తు ఐటీడీఏ పీవో ఆదేశాలు ఇచ్చిన బుట్ట దాఖలు అవుతున్నవి.రోగుల బాధలు ఆర్యణ్య రోదన గా మారింది.పినపాక నియోజకవర్గంలో వైద్యుల కొరత పై మన్యం టివి కథనం.పినపాక నియోజకవర్గ కేంద్రం తో పాటు జానంపేట, కరకగూడెం,మణుగూరు, అశ్వాపురం, గుండాల ,ఆళ్లపల్లి లో ఒక్కొక్క వైదున్ని తో ప్రాథమిక కేంద్రాలు కొనసాగుతున్నాయి.దీని తో ఆయా మండలాల్లో వైద్యం సరిగా అందక రోగులు అవస్థలు పడుతున్నారు.