రోడ్డు పక్కనే పడవేస్తున్న చికెన్ వ్యర్ధాలు
చికెన్ సెంటర్ వ్యాపారుల తీరు మారని వైనం
శునకాలు వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైనం
బోయినిపల్లి జూన్ 6 (నిజం చెపుతాం);
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నీలోజిపల్లి-కోదురుపాక గ్రామాల మధ్యలో వేములవాడ-కరీంనగర్ రహదారి పక్కన చికెన్ వ్యాపారులు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చికెన్ వ్యక్తపదార్థములు రోడ్డు పక్కన పడి వేయడంతో, కుక్కలు అవి తిని స్వైర విహారం చేస్తూ, రోడ్లపై పరిగెత్తుతూ వాహనదారులకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి…మొసలి చావుకు కారకులెవరు?
రోడ్డు ప్రక్కన చికెన్ వ్యర్థాలను పడవేయడంతో అటువైపుగా పోతున్న వాహనదారులకు కుళ్లిన వాసన వస్తుండటంతో ఆ ప్రాంతం వైపు నుండి ప్రయాణం చేయాలంటేనే చాలా ఇబ్బందిగా మారింది.
శునకాల వలన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి.గ్రామ పంచాయతీకి సంబంధించిన చెత్త బండిని వినియోగించుకోకుండా, రోడ్డు పక్కన వేయడం ఏంటని అందరూ దారిన పోయే వారు అంటున్నారు.
అధికారులు స్పందించి ఇలాంటి వ్యర్థ పదార్థములు రోడ్డు పక్కన వేయకుండా చర్యలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు మరియు పలువురు కోరుచున్నారు.