మొసలి చావుకు కారకులెవరు?
ఉన్నతాధికారులుకు తప్పుడు నివేదిక ఇచ్చిన అధికారిపై చర్యలు తీసుకుంటారా?
ఆదోని డివిజన్ జూన్ 06 (నిజం న్యూస్) పెద్దకడబూరు మండలం కంబలదిన్నే గ్రామ సమీపంలో ఉన్న వగరూరు చెరువు నుండి జనవాసాల్లోకి వచ్చిన ముసలిని గ్రామంలో ఉన్న ప్రజలు భయపడి చంపిన వీడియో వైరల్ అయ్యింది.
ముసలి మృతికి సంబందించిన వివరాలను తెలుసుకునేందుకు అటవీ రేంజ్ అధికారి తన సిబ్బందితో కలసి వెళ్లి సదరు గ్రామంలో తూతూ మంత్రంగా విచారణ చేపట్టి ఎదో ఒక నివేదిక రాసి ముసలిని స్థానికులతో కలిసి చెరువులో విడిచినట్లు జిల్లా అధికారికి నివేదికను పంపినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి…..తుంగతుర్తి లో ఆర్ డి ఆర్ ఆశీస్సులు… ఎవరికో??
అయితే మరుసటిరోజు పలు పత్రికల్లో. జనావాసాల్లోకి వచ్చిన ముసలిని భయాందోళనకు గురైన ప్రజలు చంపినట్లు వార్తలు రావడంతో అవాక్కైన అటవీ అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని మరల విచారణ చేపట్టారు.
చనిపోయిన ముసలిని కొందరు గ్రామస్తులు తిన్నట్లుగా ఆరోపణలు వస్తుంటే చనిపోయిన ముసలిని అటవీ అధికారులు ఏ విధంగా చెరువులో వదిలినట్లు ఎలా జిల్లా అధికారికి సమాచారం ఇచ్చారని కొందరు ప్రజలు అది ఎలా సాధ్యం అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం చనిపోయిన మొసలిని స్వాధీనం చేసుకొని పరీక్షలు నిమిత్తం పంపించాల్సి ఉంది అయితే ఇటు జిల్లా అధికారికి తప్పుడు సమాచారం ఇచ్చిన రేంజ్ అధికారిపై చర్యలు తీసుకుంటారో లేక చూసి చూడనట్లుగా ఉంటారోనని ప్రజలు గుసగుసలాడుతున్నారు.
ఏది ఏమైనా అటవీ అధికారులు సక్రమంగా విచారణ చేపట్టి ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చేది కాదు కావున సంబంధిత జిల్లా అటవీఅధికారి ముసలి చావుకు కారణమైన వారిపై కేసులు నమోదు చేస్తారా లేక తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు