తుంగతుర్తి లో ఆర్ డి ఆర్ ఆశీస్సులు… ఎవరికో??
తెలంగాణలో రోజురోజుకి పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమంలో సేవకుడిగా వెన్నంటి పనిచేస్తున్న గుడిపాటి నరసయ్య…
నియోజకవర్గంలో ప్రతి ప్రజా సమస్యలపై నిరంతరం పాలుపంచుకుంటున్న అన్నపర్తి జ్ఞాన సుందర్…
ఎన్నికల్లో టికెట్ సంపాదించి …ఓడిపోయి. మూడోసారి ఆర్డిఆర్ ఆశీస్సులు తీసుకున్న అద్దంకి దయాకర్
రాహుల్ గాంధీ ఆశీస్సులతో, నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేస్తున్న నాగరి గారి ప్రీతం.
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నా ధ్యేయమంటూ ఆర్ డి ఆర్, ఎంపీల ఆశీస్సులతో కార్యక్రమాలు చేసుకుంటున్నా డాక్టర్ వడ్డేపల్లి రవి..
హైదరాబాద్ జూన్ 6 నిజం చెబుతాం న్యూస్
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, గత 15 రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయదుంబి నిర్వహించి అనుకున్నట్లుగా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తూ ముఖ్యమంత్రి పట్టాభిషేకాన్ని కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నది. దీనితో తెలంగాణ రాష్ట్రంలో కూడా రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ బలంగా తయారవుతున్నది.
తుంగతుర్తి నియోజకవర్గం లో మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గెలిచినప్పటినుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్నది.2014, 2018లో అద్దంకి దయాకర్ సీటు పొందినప్పటికీ, ఐకమత్య లోపంతో, నాయకుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఓటమిపాలు జరుగుతుందన్నది వాస్తవం.
2024 ఎన్నికల సమీపిస్తున్నందుకు తుంగతుర్తి నియోజకవర్గంలో టికెట్ కోసం పార్టీ కోసం ఎల్లవేళలా కృషి చేస్తున్న ఆర్ డి ఆర్ నమ్మినబంటు గుడిపాటి నరసయ్య టికెట్ కోసం ఆశిస్తున్నారు. రెండు పర్యాయాలు నియోజవర్గంలో ఓటమిపాలై తిరిగి ఆర్డిఆర్ ఆశీస్సులు పొందుతూ మళ్లీ టికెట్ కోసం అద్దంకి.. దయాకర్ ప్రయత్నాలు చేస్తున్నారు.
నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న అన్నపర్తి జ్ఞాన సుందర్ ఈసారి ఎమ్మెల్యే టికెట్ కోసం పూర్తిస్థాయిలో శ్రమిస్తున్నట్లు సమాచారం. ఏఐసీసీ ఉపాధ్యక్షులు మాజీ మంత్రి ఆర్ డి ఆర్, ఎంపీ కోమటిరెడ్డి ఆశీస్సులు ఉన్నట్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి…..అగ్నికి ఆహుతి అయిన హరితహారం మొక్కలు
ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ సన్నిహితంతో, ఆర్డిఆర్, ఎంపీ, ఆశీస్సులతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పలు కార్యక్రమాలు చేపట్టినట్లు, టికెట్ కోసం నాగరి గారి ప్రీతం కష్టపడుతున్నారు.
2018 నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం, ఢిల్లీ దాకా వెళ్లి పోరాటం చేసి, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆపదలు, కష్టాలను మోస్తూ, మాజీ మంత్రి ఆర్ డి ఆర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గంలో ముందుకు సాగుతున్నట్లు డాక్టర్ వడ్డేపల్లి రవి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.
తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ తప్పనిసరిగా రావాలంటే మాజీ మంత్రి ఆర్డిఆర్,, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ల ఇరువురు దీవెనల అవసరం. ఇందులో ఒకరి దీవెన ఉండే మరొక దీవెన లేకపోయినట్లయితే టికెట్ వచ్చే ఛాన్స్ ఏ లేదని మేధావులు, పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు రెండు దఫాలుగ తుంగతుర్తి నియోజకవర్గంలో సీటును పొందిన అద్దంకి దయాకర్, ప్రస్తుత పరిస్థితి , తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి తాము ఎక్కడ సీటు ఇస్తే అక్కడ పోటీలో నిలబడాలని కోరినట్లు సమాచారం..
ఏది ఏమైనా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డబ్బులకు దాసోహం కాకుండా కష్టపడి పని చేసినట్లయితే, గెలుపు సాధ్యమని, ఈ ఐదుగురు నాయకులు టికెట్ కోసం పోటీలో ఉన్నప్పటికీ , ముఖ్యంగా ఆర్ డి ఆర్ ఆశీస్సులు ఎవ్వరికి ఉంటాయో, ఎవరు టిక్కెట్టు పొందుతారు టికెట్ వచ్చిన అనంతరం ఐకమత్యంతో ముందుకు సాగుతారా…. సాగితేనే గెలుపు తద్యమని, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, విశ్లేషకులు భావిస్తున్నారు . ఈ పాండవుల్లో టికెట్ ఎవరికి వస్తుందో… వేచి చూడాల్సిందే సుమ….