Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అగ్నికి ఆహుతి అయిన హరితహారం మొక్కలు

గరిడేపల్లి జూన్ 6 (నిజం చెపుతాం)

గరిడేపల్లి మండలం పొనుగోడు మర్రికుంట గ్రామాల మధ్యలో ఉన్న పంట పొలాలలో వరి కొయ్యలకు రైతులు నిప్పు పెట్టడంతో దీనివలన, పదుల సంఖ్యలో రోడ్డు పక్కన నాటినటువంటి హరితహారం మొక్కలు పూర్తిగా తగలబడిపోయినాయి.

రహదారి పక్కన ఉన్నటువంటి చెట్లు కాలిపోవడంతో రోడ్డు పక్కన నిలువ నీడ లేకుండా పోయినది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వ్యక్తులు ఎండ తీవ్రత సమయంలో కొద్దిసేపు చెట్టు నీడ ఉండడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి….మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి లక్ష్య అవార్డు

ఒకపక్క ప్రభుత్వం హరితహారం పేరిట మొక్కల్ని నాటడమే గాక వాటి సంరక్షణ బాధ్యతని తీసుకొని చిన్న పిల్లల వాడిని పెంచుతుంటే ఇలా చేయడం సరికాదని పలువురు చెట్ల సంరక్షకులు వాపోయారు.

అధికారులు, నాయకులు కలుగజేసుకొని ఇలా చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇక మీదట ఇలా ఎవరు చేయకుండా చూడాలని స్థానికులు తెలిపారు.