Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి లక్ష్య అవార్డు

సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఘనత ….‌.

సంగారెడ్డి జూన్ 06 ( నిజం చెపుతాం )

సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి ‘లక్ష్య’ అవార్డు వరించింది. నేషనల్ ఎక్స్టెర్నల్ అసెస్మెంట్లో భాగంగా కేంద్ర బృందం ఏప్రిల్ 2, 3వ తేదీల్లో పర్యటించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం మార్కులతో కూడిన అవార్డుకు ఎంపికైనట్లు ప్రకటించింది.

ఎంసీహెచ్లోని లేబర్ రూముకు 89 శాతం మార్కులు, ఆపరేషన్ థియేటర్కు 85 శాతం మార్కులు సాధించినట్లు వెల్లడించింది. జాతీయస్థాయిలో ‘లక్ష్య’ అవార్డు వచ్చినందుకుగాను ఎంసీహెఛ్ కు ఏటా రూ. పన్నెండు లక్షల చొప్పున మూడేళ్లకుగాను రూ.36 లక్షల నగదు పురస్కారం దక్కనున్నది.

లక్ష్య కార్యక్రమం అమలులో భాగంగా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్లలో అందిస్తున్న వైద్య సేవల్లో నాణ్యతాప్రమాణాలు ఏ మేరకు పాటిస్తున్నారో పరిశీలించారు. మాతా శిశు మరణాల రేటు తగ్గించడమే కాకుండా సేవల్లో వందశాతం సంతృప్తి ఇవ్వడమే ‘లక్ష్య’ పథకం ఉద్దేశం.

ఆయా విభాగాల్లో సోపర్ట్ సర్వీసెస్, ఇన్ఫెక్షన్ కంట్రోల్, సర్వీస్ ప్రొవిజన్, ఇన్పుట్, ఔట్కమ్, పేషెంట్ కేర్, గర్భిణి, బాలింత రికార్డుల నిర్వహణ, వసతులు, వైద్య సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.

ఇది కూడా చదవండి…చేతి వృత్తుల వారికి ల‌క్ష ఆర్థిక సాయం.. ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానం

ప్రధానంగా గౌరవ ప్రదమైన ప్రసూతి రక్షణ, నాణ్యతతో కూడిన కేరింగ్, ప్రసవ సమయంలో నాణ్యత పాటించడం, ఆపరేషన్ థియేటర్లో నాణ్యతా ప్రమాణాలను మెరుగుదలను గుర్తించి కేంద్రబృందం సంతృప్తి చెంది అవార్డు ఎంపిక చేసిందనీ, లక్ష్య అవార్డు సాధించడం సంతోషంగా ఉన్నదనీ,

కష్టానికిప్రతిఫలం దక్కిందని భావిస్తున్నామనీ, డాక్టర్లు, వైద్య సిబ్బంది సమిష్టి కృషి, సహకారం వల్లే లక్ష్య వరించిందనీ,. ఇటీవలే ముస్కాన్ అవార్డు కూడా వచ్చిందని,. దానితో పాటు తాజాగా లక్ష్య అవార్డు రావడంతో బాధ్యత మరింత పెరిగిందదని,. ఇదే స్పూర్తితో ముందుకెళ్తఆమనీ . లక్ష్య పురస్కార సాధనలో భాగస్వాములైన అందరికి ప్రత్యేకంగా డాక్టర్ అనీల్ కుమార్ సూపరింటెండెంట్, కృతజ్ఞతలుతెలిపారు.