Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రోడ్డు ఎక్కాలంటే గుండె గుభేలు

*మండుతున్నఎండలు

తూర్పుగోదావరి జిల్లా

జూన్ 6.. నిజం చెపుతాం న్యూస్..

రోహిణి కార్తెలో రోలు బద్దలవుతుందనే నానుడి నిజం చేస్తున్నట్లు ఉంది తూర్పుగోదావరి జిల్లాలో భానుడి ప్రతాపం. ప్రతీ రోజు ఉదయం తొమ్మిది అవ్వకుండానే సూర్య ప్రతాపం ప్రారంభమై సాయంత్రం ఏడు దాటిన కూడా గుభేలు మనేలా వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

ఇంకా వాహనదారుల పాట్లు అన్ని ఇన్ని కావు.అగ్నిగోళాన్ని మోస్తున్నట్లులా ప్రయాణం కొనసాగించవలసిన అగత్యం ఏర్పడింది.

Also read: మండలంలో బడిబాట కార్యక్రమం జాడేది

ఎండ తీవ్రత వల్లన రహదారులన్ని నిర్మానుష్యంగా ఉంటున్నాయి.ఇంత ఎండల్లో ప్రయాణం చేయడం మంచిది కాదు అని నిపుణులు చెప్తున్నారు.

ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసివస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు అంటున్నారు.ఏది ఏమైనా రెక్కాడితే గాని డొక్కాడని బడుగు అల్పదాయ వర్గాలు, రైతులు,ఉపాధి హామీ కూలీలు,చిరువ్యాపారులు,

ప్రైవేట్ విద్యాసంస్థల్లో అడ్మిషన్స్ కోసం కాంపెయిన్ చేసే సిబ్బంది,ఇలా పలువురు ఎండల వల్ల తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్నారు.