Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మండలంలో బడిబాట కార్యక్రమం జాడేది

మాడ్గుల జూన్ 06( నిజం చెపుతాం): మండలంలోని ఇర్విన్, కొలుకు లపల్లి, గిరికొత్తపల్లి,నర్సంపల్లి, ఆవురుపల్లి, నల్లవారి పల్లి, చౌటకుంట తండా బడిబాట కార్యక్రమం జాడేలేదని ఆ గ్రామాలలోని ప్రజలు సంబంధిత అధికారులపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రభుత్వ బడులను కాపాడే బాధ్యత ఉపాధ్యాయులపై కూడా ఉంది ఆ నిబంధనలు ఏ ఉపాధ్యాయుడు కూడా పాటించకుండా వారి పిల్లలను కార్పొరేట్ పాఠశాలలో చదివించుకుంటు ప్రభుత్వ పాఠశాలను బ్రష్టు పట్టిస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉపాధ్యాయులపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బడిబాట కార్యక్రమం నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే బడిబాట కార్యక్రమం మండలంలోని వివిధ గ్రామాలలో నిర్వహించడం లేదని పలు విమర్శలు గ్రామాలలో అధికారులపై వెలువెత్తుతున్నాయి.

Also read: ఆగస్టు 11న భోళాశంకర్‌

మండల స్థాయిలో పర్యవేక్షించే ఎంఈఓ, కాంప్లెక్స్ పరిధిలో పర్యవేక్షించే ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణ లోపం వలనే బడిబాట కార్యక్రమం సజావుగా సాగడం లేదని పలు గ్రామాలలోని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చూపి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి సంబంధిత అధికారులతో పాటు, ప్రజా ప్రతినిధులు శ్రద్ధ వహించి బడిబాట కార్యక్రమం సజావుగా సాగే విధంగా కృషి చేయాలని వివిధ గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.