Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆగస్టు 11న భోళాశంకర్‌

’వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీసును దున్నేసిన చిరంజీవి ఈసారి ’భోళా శంకర్‌’గా అభిమానుల ముందుకొస్తున్నారు.

స్టైలిష్‌ మేకర్‌ మెహర్‌ రమేష్‌ మాసివ్‌ యాక్షన్‌ ఎంటర్ టైనర్ గా  ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఆగస్టు 11న ’భోళాశంకర్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ’భోళా శంకర్‌’ నుంచి ’అదిరే స్టైల్‌ అయ్యా, పగిలే స్వాగ్‌ అయ్యా, యూఫోరియా నా ఏరియా, హే భోళా మానియా’ అంటూ సాగే తొలి గీతాన్ని ఆదివారం చిత్రబృందం విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని మహతి స్వర సాగర్‌ స్వరపరిచారు.

రేవంత్‌ ఎల్వీ ఆలపించారు. ఈ చిత్రంలో తమన్నా చిరంజీవికి జోడీగా నటిస్తున్నారు.
కీర్తిసురేశ్‌ చిరుకు చెల్లెలుగా కనిపించనున్నారు. రామబ్రహ్మం సుంకర భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.