Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ఆత్మకూర్ ఎస్ జూన్ 5 (నిజం చెబుతాం): ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించబడుతుందని సర్పంచ్ పన్నాల అలివేలు అన్నారు.

సోమవారం మండల పరిధిలోని పాత సూర్యాపేట గ్రామల్లో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత మధ్యాహ్న భోజనంతోపాటు మన ఊరు- మనబడి కార్యక్రమాల్లో భాగంగా పాఠశాలలో అన్ని వసతులు కల్పించడం జరిగిందని గ్రామంలోని పెద్దలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించడం జరిగింది.

ఇది కూడా చదవండి….మూసి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి దారాసింగ్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రంగాచార్యులు ప్రధాన ఉపాధ్యాయులు ప్రకాష్ ఎస్ఎంసి చైర్మన్ బి లత సైదులు, ఉపాధ్యాయులు చంద్రకళ, అమీనా బేగం, సులోచన హేమలత విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.