ఒక్క దొంగతనం… ఎన్నో అనుమానాలు
గరిడేపల్లి జూన్ 5 నిజం చెబుతాం. …
ఒక్క దొంగతనం ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. ఈ దొంగతనం ప్రాథమిక సహకార సంఘం లో చేసే సిబ్బంది పనే లేక బయట వ్యక్తుల పన అనేలా ఉంది.
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో ఉన్న రాయిని గూడెం ప్రాథమిక సహకార సంఘం భవనంలో ఆదివారం రాత్రి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వెనుక భాగంలో ఉన్న కిటికీ రెండు చివరన గడ్డ పలుకుతో తొలగించి కౌంటర్ లో ఉన్న 8 లక్షల రూపాయలను దొంగిలించడం జరిగిందనీ సీఈవో కాట్రేవుల లక్ష్మయ్య తెలిపారు.
డబ్బును కౌంటర్ లోనే ఉంచిన వైనం. ప్రతిరోజు వచ్చే లావాదేవీలను చూసుకొని సాయంత్రం సిబ్బంది వెళ్లేటప్పుడు మిగిలిన డబ్బులు లాకర్లో భద్రపరచాలి కానీ రాయని గూడెం ప్రాథమిక సహకార సంఘంలో పనిచేసే సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంతో డబ్బును లాకర్ లో పెట్టకుండా కౌంటర్ లోనే ఉంచి తాళం వేసి వెళ్లారు.
ఇది కూడా చదవండి…..బేర్లదరువు, నృత్యాలతో గంగమ్మ జాతర
తర్వాత రోజు దొంగతనం జరగడంతో అనేక అనుమానాలకు తావిస్తుంది. దొంగతనం సిబ్బంది పనే లేక బయట వ్యక్తుల పన. ప్రాథమిక సహకార సంఘం భవనం వెనుక భాగంలో ఉన్న కిటికీ రెండు చివులను తొలగించి దొంగతనం చేశారు.
అయితే ఆ కిటికీ ద్వారా చిన్న పిల్లలు మాత్రమే వెళ్ళగలుగుతారని దీని ద్వారా పెద్దలు వెళ్లలేరని ఈ దొంగతనం ఇందులో పనిచేసే సిబ్బంది లేదా ఈ భవనం గురించి బాగా తెలిసిన వ్యక్తులు ఎవరైనా చేశారా అని స్థానికులు చర్చించుకోవడం గమనర్హం.
ఈ విషయమై గరిడేపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ని సంప్రదించగా ఈ ఉదయం వచ్చి సహకార సంఘం లో దొంగతనం జరిగిందని సంఘ సిబ్బంది సమాచారం ఇచ్చారని దానికి ప్రతిగా ఎంత డబ్బు దొంగిలించారు పూర్తిగా సరిచూసుకొని చెప్పండి అని అన్నానన్నారు. కానీ ఇప్పటివరకు బ్యాంకు సిబ్బంది స్టేషన్ కి వచ్చి కేసు నమోదు చేపించలేదు అని తెలిపారు.