Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బేర్లదరువు, నృత్యాలతో గంగమ్మ జాతర

గరిడేపల్లి జూన్ 5 (నిజం చెపుతాం)
గరిడేపల్లి మండలం కల్మల చెరువు గ్రామంలో గంగమ్మ జాతర సందర్భంగా కల్మలచెరువు యాదవులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బేర్లదరువులతో యాదవుల నృత్యం చేసుకుంటూ మహిళలు బోనాలు ఎత్తుకొని అమ్మవార్లకు సమర్పించడం జరిగింది .

అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.

తమ గ్రామాన్ని చల్లగా చూడాలని, వర్షాలు బాగా కురిసి పాడి పంటలతో తమ గ్రామం కళకళలాడాలని వారు కోరుకున్నారు.

ఇది కూడా చదవండి…..నేల కొరుగుతున్న వందల ఏళ్ళ నాటి చెట్లు
ఈ యొక్క కార్యక్రమంలో మాజీ యాదవ సంఘం అధ్యక్షులు గంధం యల్లయ్య యాదవ్, మండల సోషల్ మీడియా కన్వీనర్ వట్టె యల్లయ్య యాదవ్, రైతు సంఘం అధ్యక్షులు పోతురాజు చంద్రయ్య, గ్రామ ప్రధాన కార్యదర్శి బచ్చలకూరి శ్రీను, నట్టే సైదయ్య, పందిరి నాగయ్య, వట్టె వెంకటేశ్వర్లు యాదవ్, అవిరబోయిన సైదులు యాదవ్, కుర్ర యల్లరాజు యాదవ్, సోదరులు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.