Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నేల కొరుగుతున్న వందల ఏళ్ళ నాటి చెట్లు

జగిత్యాల ,జూన్ 5 (నిజం చెపుతాం).

జగిత్యాల: హరితహారంలో దేశంలోనే తెలంగాణ నెం 1 స్థానంలో ఉంటె జగిత్యాలలో మాత్రం ఏళ్ళ చరిత్రగల చెట్లను కూకటి వేళ్ళతో తొలగిస్తున్నారు .

జగిత్యాలలో మాత్రం వందల ఏళ్ళ నాటి నీడను, ప్రాణవాయువును ఇచ్చే చెట్లను నరికి కూకటివేళ్ళతో పెకలించి వేస్తున్నారు.

రోడ్దు వెడల్పు కార్యక్రమంలో బాగంగా తోలిగిస్తున్నమంటున్న అధికారులు జగిత్యాల చుట్టూ పెద్ద ఎత్తున బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.

ఇది కూడా చదవండి….వైభవంగా సాయిబాబా వార్షికోత్సవం

ధర్మపురి నుంచి పొలస, తిమ్మాపూర్, మోతే, వెల్దుర్తి,నర్సింగాపూర్ ధరూర్ కెనాల్ వరకు అలాగే కరీంనగర్ రోడు నుంచి ధరూర్ కెనాల్ అంతర్గాం మీదుగా నిజామబాద్ రోడు లోని చలిగల్ వరకు, అలగే ధర్మపురి రోడు నుంచి తిప్పన్న పేట మీదుగా చలిగల్ వరకు ఇలా జగిత్యాల పట్టణం చుట్టూ రింగ్ రోడ్ వేస్తున్నారు.

జగిత్యాల చుట్టూ రింగ్ రోడ్ వేస్తుండగా  మళ్ళి పెద్దగానే ఉన్న నిజామబాద్ రోడును ఇంకా పెంచి వందల ఏళ్ళ నాటి పెద్ద పెద్ద చెట్లను తొలగించి పర్యావరణాన్ని కలుషితం చేయవద్దని స్థానికులు కోరుతున్నారు.

ప్రభుత్వం మొక్కలు నాటిన అవి వీటిల నీడనిచ్చేవి కావని, అయిన అవి ఎదగాలంటే మల్లి ఎన్నో ఏళ్ళు వేచి చూడాలని అంటున్నారు. వందల ఏళ్ళ నాటి చెట్ల తొలగింపు నిలిపి వేయాలని, స్థానికులు పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.