మన్యంమనుగడ సంచికని స్వీకరంచిన మాజీ ఎంపీ పొంగులేటి

సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా అశ్వారావుపేట మండలం విచ్చేసిన పొంగులేటి శ్రీనన్నకు మన్యం మనుగడ సంచికను అశ్వారావుపేట మన్యంటీవీ రిపోర్టర్ దాది చంటి ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొంగులేటి మాట్లాడుతూ రేగా కాంతారావు పత్రిక ప్రారంభించి మంచి పని చేశాడని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి తెరాస నియోజకవర్గ నాయకులు మట్టా దయానంద్, అశ్వరావుపేట తెరాస నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎంపిపి జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, రైతు సమన్వయ మండల అధ్యక్షులు జూపల్లి రమేష్, మాజీ జెడ్పిటిసి మల్లికార్జునరావు మండల సర్పంచులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.