వైభవంగా సాయిబాబా వార్షికోత్సవం
అంగరంగ వైభవంగా సాయిబాబా వార్షికోత్సవం
జగిత్యాల జూన్ 5(నిజం చెపుతాం )
జగిత్యాలలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో 24వ వార్షికోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి.మూడు రోజులపాటు ఉత్సవాలను, పూజలను స్వామికి శాస్త్రోక్తంగా నిర్వహించారు.
మూడో రోజు సోమవారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం ,గౌరీ పూజ ,సహస్ర కలశ స్థాపన ,సహస్ర కలశఅభిషేకం, శ్రీ లక్ష్మీ నారాయణ సహిత రుద్ర హోమం ,పూర్ణాహుతి, విమానోపరి కుంబాభిషేకం, లక్ష పుష్పార్చన ,హారతి, మంత్రపుష్పం,అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.
ఇది కూడా చదవండి….కేటీఆర్ పర్యటన పనులను పరిశీలించిన మంత్రి సత్యవతి రాథోడ్
ఈ ఉత్సవాలు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, పౌరాణిక ,వేద, పండితులు శ్రీ నంబి వేణుగోపాలచార్య కౌశిక ప్రత్యక్ష పర్యవేక్షణలో, శ్రీ సుగుణానంద స్వామి విజయవాడ వారి పర్యవేక్షణలో జరిగాయి.
ప్రముఖ పౌరాణిక, వేద పండితులు శ్రీ తిగుళ్ల విశు శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు వేనయ్య బృందంతో కార్యక్రమాలు నడి చాయి.
సాయంత్రం సహస్ర దీపాలంకరణతో కార్యక్రమాలు ముగిషయని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్, నాగుల కిషన్ గౌడ్, మారకైలాసం ,పురుషోత్తం రావు, రామ్ కిషన్ రావు, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, సత్సంగ్ సభ్యులు ,పుర ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.