ఉరేసి భార్యను హతమార్చిన భర్త
చర్ల జూన్ 5 ( నిజం చెపుతాం) వైరుతో బాత్రూంలో మెడకు ఉరివేసి భార్య హతమార్చిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది .
దీనికి సంబంధించిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని పశువైద్యశాల సమీపంలో అద్దె ఇంట్లో నివాసముంటున్న వి .5. యూట్యూబ్ ఛానల్ లో విలేకరుగా పనిచేస్తున్న పాత కట్ల రవి ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో భార్య సుజాత (35)ను బాత్రూంలో మెడకు వైరుతో ఉరివేసి హత్య చేశాడు
హార్ట్ ఎటాక్ తో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు బంధువులు మెడపై గాయాలు చూసి గట్టిగా ప్రశ్నించడంతో పరారయ్యాడు.
ఇది కూడా చదవండి….ఖమ్మంలో మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
ఇతనికి పెద్ద భార్య రేవతి ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు కావడంతో ఆమె చెల్లెను సుజాతను రెండవ వివాహం చేసుకున్నాడు ఈ వీరిద్దరూ కాకుండా వాజేడులో మూడవ భార్య నాగమణి కూడా ఉందని బంధువులు తెలిపారు
రవి పలు కేసుల్లో నిందితుడు నిందితుడు అని కుటుంబ సభ్యులు తెలిపారు బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు