Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కేటీఆర్ ప‌ర్య‌ట‌న ప‌నుల‌ను ప‌రిశీలించిన మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌

ములుగు జిల్లా ప్రతినిధి, నిజం చేపుతాం, జూన్ 5:- ములుగు జిల్లాలో ఈనెల 7వ తేదీన రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు పర్యటనను పురస్కరించుకొని చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల ఏర్పాట్లను రాష్ట్ర గిరిజన స్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు.

సోమవారం ఉదయం రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, ఎస్పీ గౌస్ ఆలం, జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇతర అధికారులతో పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు.

ఇది కూడా చదవండి….వేలాడుతున్న కరెంట్ వైర్లు కంటికి కనిపించడం లేదా

అక్కడ నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ పరిశీలించారు. ఆ తర్వాత సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణ పనులను మంత్రి సందర్శించారు. ములుగు జీపీ పరిధిలో మాధవరావు పల్లె వద్ద నిర్మించిన స్మశాన వాటికను పరిశీలించారు. ములుగు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేయనున్న శిలాఫలకాల స్థలిని పరిశీలించారు.

అనంతరం ఎంపీడీవో కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని మంత్రి పరిశీలించారు. అక్కడినుండి బండారుపల్లి గ్రామ శివారులో నిర్మించే సేవాలాల్ భవన స్థలాన్ని పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి,గ్రంథాలయ చైర్మన్ గోవింద నాయక్, ఆర్ అండ్ బి ఎస్ సి నాగేందర్ రావు,ఈ ఈ వెంకటేష్, ఇరిగేషన్ ఎస్ ఈ విజయ భాస్కర్, ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ హేమలత, మత్స్య శాఖ అధికారి శ్రీపతి, డి డబ్లు ఓ ప్రేమ లత, జడ్పిటిసి సకినాల భవాని గై రుద్రమదేవి, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, తహశీ్దార్లు సత్యనారాయణ, మంజుల, ఎంపీడీవో ఇక్బాల్, సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.