Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వేలాడుతున్న కరెంట్ వైర్లు కంటికి కనిపించడం లేదా

విద్యుత్ ప్రగతి కార్యక్రమం చేయడం సిగ్గుచేటు

– వ్యవసాయ భూములల్లో నిలబడితే తాకే ఎత్తులో వేలాడుతున్న విద్యుత్‌ తీగలు

– స్థానిక ఎమ్మెల్యే, విద్యుత్ అధికారులకు ఈ వేలాడుతున్న కరెంట్ వైర్లు కంటికి కనిపించడం లేదా

టిపిసిసి సభ్యులు గండ్ర సత్యనారాయణరావు

చిట్యాల జూన్ 05 (నిజం చెపుతాం)

దశాబ్ది ఉత్సవాల పేరిట విద్యుత్ ప్రగతి కార్యక్రమం చేయడం సిగ్గుచేటని టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు ఎద్దేవా చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కొత్తపేట గ్రామ శివారు వ్యవసాయ భూముల్లో నిలబడితే తాకే ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లను స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు.

ఇది కూడా చదవండి….బీర్ బాటిల్స్ తో పండగ
నియోజకవర్గ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి అన్ని గ్రామాలల్లో ఉందని, విద్యుత్ అధికారులకు ఎన్ని సార్లు రైతులు విన్నవించున్న పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. ఈ వేలాడుతున్న కరెంట్ వైర్లు స్థానిక ఎమ్మెల్యే, విద్యుత్ అధికారులకు అగుపించడం లేదా? అని ప్రశ్నించారు.

ఇటీవల రేగొండ మండలం దుంపిల్లపల్లి గ్రామానికి చెందిన బత్తిని కొమురయ్య తన వ్యవసాయ భూమిలో కిందకి వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలి చనిపోయినట్లు గుర్తు చేశారు.