Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బీర్ బాటిల్స్ తో పండగ

ఏపీ స్టేట్ బ్యూరో

ఆ గ్రామ సమీపంలో సోమవారం బీర్ బాటిల్స్ తో చాలా మంది పండగ చేసుకున్నారు బీర్ బాటిల్స్ తో పండగేంటి అనుకుంటున్నారా అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం హైవే లో బీర్ బాటిల్స్ తో నర్సీపట్నం వెళుతున్న వ్యాన్ బోల్తా పడింది. దీంతో వ్యాన్ లో ఉన్న బీర్ బాటిల్స్ కేసులు నేలపాలయ్యాయి.

ఇది కూడా చదవండి….ఖమ్మంలో మెడికల్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఇది గమనించిన చుట్టుపక్కల జనం బీరు సీసాల కోసం ఎగబడ్డారు. దీంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.

లారీ డ్రైవర్ ఎంత వద్దని వారించినా ప్రజలు వినకుండా తమకు దొరికినంత వరకు పట్టుకుని వెళ్లారు.

వేసవిలో అధిక ఎండలతో భాధపడుతున్న ప్రజలు కూల్ బీర్లతో సేద దీరే అవకాశం దొరికిందని అనుకున్నారు.