Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఏడుపాయల వనదుర్గా మాతను దర్శించుకున్న బీజేపీ నాయకులు

దుర్గమ్మను దర్శించుకున్న బిజెపి జాతీయ కార్యదర్శి

ఏడుపాయల వన దుర్గా మాతను దర్శించుకున్న బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్:బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి

సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ 5 జూన్ (నిజం న్యూస్)

పాపన్నపేట/మెదక్ జిల్లా, మనమే సాక్ష్యం:ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడు పాయల వనదుర్గామాతను సోమవారం నాడుభారతీయ జనతా పార్టీ (బీజేపీ)జాతీయ కార్యదర్శి,తెలంగాణ సహా ఇంచార్జ్ అరవింద్ మీనన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.పలు కార్యక్రమాల్లో భాగంగా మెదక్ అసెంబ్లీకి విచ్చేసిన ఆయనను ఉదయం ఏడుపాయల వనదుర్గామాత ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు.

ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి,ఉపాధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ ముదిరాజ్, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ ఎక్కల్ దేవిమధుసూదన్ నేత,బిజెపి నాయకులు అమ్మవారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.

Also read: జూన్ 10 – 17 లలో తెలుగురాష్ట్రాల్లో వర్షాలు

అనంతరం మెదక్ జిల్లా పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించి పలు కేంద్ర అభివృద్ధి పనులను వివరించి ప్రజలకు తెలిపారు.