జూన్ 10 – 17 లలో తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
జూన్ 10 మరియు 17 తేదీల మధ్య రెండు తెలుగురాష్ట్రాల్లోని రాయలసీమ, తెలంగాణ, కోస్తాంధ్ర జిల్లాలోని అన్ని ప్రాంతాలను నైరుతి-రుతుపవనాల తొలకరి వర్షాలు/జల్లులు పలకరించే అవకాశం ఎక్కువగా ఉంది.
ఈసారి తొలకరి వర్షాలు గత 4- సంవత్సరాలుగా కాకుండా చాలా బలహీనంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.
Also read: ఈసారి ఎల్-నినో ప్రభావిత కరువు పరిస్థితులు
అనగా గాలులు-వేగం ఎక్కువగా ఉండి, వర్షాల-తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉంది.
కావున రైతు-సహోదరులు, ఖరీఫ్ (మొదటి పంట) సాగుకు విత్తనాలు చల్లేటప్పుడు నేల మరియు వాతావరణ పొరలలో చల్లదనాన్ని జాగ్రత్తగా గమనించగలరు.
అలాగే విత్తనాలు చల్లిన తర్వాత ఒకవేళ వర్షాలు తగిన విధంగా లేనట్లయితే, తడులు పెట్టుకోడానికి ఇతర మార్గాలు సిద్దంగా ఉంచుకోవడం మంచిది.
నైరుతి రుతుపవనాలు జూన్ 3వ వారం నుండి జూలై 3వ వారం వరకు క్రియాశీలకంగా ఉండి చురుగ్గా కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అందువల్ల రైతు-సహోదరులు ఈ ఖరీఫ్ సీజన్ గురించి పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు.