Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈసారి ఎల్-నినో ప్రభావిత కరువు పరిస్థితులు

జూన్ 10 మరియు 17 తేదీల మధ్య రెండు తెలుగురాష్ట్రాల్లోని రాయలసీమ, తెలంగాణ, కోస్తాంధ్ర జిల్లాలోని అన్ని ప్రాంతాలను నైరుతి-రుతుపవనాల *తొలకరి వర్షాలు/జల్లులు పలకరించే* అవకాశం ఎక్కువగా ఉంది.

ఈసారి తొలకరి వర్షాలు గత 4- సంవత్సరాలుగా కాకుండా *చాలా బలహీనంగా* ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.

అనగా గాలులు-వేగం ఎక్కువగా ఉండి, వర్షాల-తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉంది.

కావున రైతు-సహోదరులు, ఖరీఫ్ (మొదటి పంట) సాగుకు విత్తనాలు చల్లేటప్పుడు నేల మరియు వాతావరణ పొరలలో చల్లదనాన్ని జాగ్రత్తగా గమనించగలరు.

Also read: పేకమేడలా కూలిన రూ.1,710కోట్ల తీగల వంతెన

అలాగే విత్తనాలు చల్లిన తర్వాత ఒకవేళ వర్షాలు తగిన విధంగా లేనట్లయితే, తడులు పెట్టుకోడానికి ఇతర మార్గాలు సిద్దంగా ఉంచుకోవడం మంచిది.

నైరుతి రుతుపవనాలు *జూన్ 3వ వారం నుండి జూలై 3వ వారం వరకు* క్రియాశీలకంగా ఉండి చురుగ్గా కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మే 29వ తేదీన భారత వాతావరణ సంస్థ (IMD) ఇచ్చిన నైరుతి-రుతుపవనాల సీజన్ *మలి-అంచనా* ప్రకారం ఒక్క వాయువ్య-భారతదేశం మినహా, మిగిలిన అన్ని ప్రాంతాలలో (రెండు తెలుగురాష్ట్రాలు ఉన్న దక్షిణ ద్వీపకల్పం సహా) *సాధారణ వర్షపాతం (96-104%)* నమోదయ్యే అవకాశం ఉంది.

కావున ఈ ఖరీఫ్ సీజన్లో రెండు తెలుగురాష్ట్రాల్లో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్-నినో ప్రభావిత కరువు పరిస్థితులు* నెలకొనే అవకాశం *తక్కువగా* ఉంది.

అందువల్ల రైతు-సహోదరులు ఈ ఖరీఫ్ సీజన్ గురించి పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు.