కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేద్దాం…. సీఎంకేసీఆర్
నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విజ్ఞప్తి మేరకు నిర్మల్ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో జూన్ 04
(నిజం చెపుతాం)
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొండాపూర్ లో నూతనంగా నిర్మించిన బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు . తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు . పూజా కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు .
అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు , ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ని చైర్ లో కూర్చోబెట్టి ఆశీర్వదించి , అభినందనలు తెలిపారు. ఇటివల ఉత్తమ గ్రామ పంచాయితీ గా, రాష్టపతి చేతులమీదుగా అవార్డు అందకున్న మన అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం, ముఖరా(కే) గ్రామ సర్పంచ్ గాడ్గే మినాక్షి, ఎంపిటీసీ గాడ్గే సుభాష్ లను సీఎం అభినందించారు.
15 ఎకరాల్లో రూ. 56 కోట్లతో నిర్మించిన నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కె . చంద్రశేఖర రావు ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొని శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.
ధరణి పోర్టల్ తీసి బంగాళాఖాతంలో కలుపుతామని కాంగ్రెస్ అంటుందని,ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతం లో కలుపుతామనే వారినే.. బంగాళాఖాతంలో కలిపేద్దామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి…..సురక్షితమైన సమాజ నిర్మాణంలో పోలీస్ పాత్ర కీలకం
నిర్మల్‌లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ను సీఎం కెసిఆర్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం నిర్మల్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదన్నారు. నిర్మల్ జిల్లాలోని 396 గ్రామపంచాయతీలకు రూ.10 లక్షలు చొప్పున నిధులు ఇచ్చామని పేర్కొన్నారు.
నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు చొప్పున నిధులు, జిల్లాలోని 19 మండలాలకు రూ.25 లక్షల చొప్పున నిధులిచ్చాయని కేసీఆర్ తెలిపారు.
రెవెన్యూ శాఖలో దోపిడీ నివారణకే ధరణి పోర్టల్ ను ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. తలసరి ఆదాయంలో దేశలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. త్వరలో బాసర ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో.. పోతుందో.. తెలిసేది కాదని, ఇప్పుడు తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో దోపిడీతో బాధలు పడ్డామని, కాంగ్రెస్ వస్తే రైతుబంధుకు రాంరాం పలుకుతారన్నారు. ఈనెల 8న గ్రామాల్లో చెరువుల దగ్గర పండుగ నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఎస్సారెస్పీ ద్వారా లక్ష ఎకరాలకు నీళ్లు అందుతాయని భరోసా ఇచ్చారు. పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా అగ్రస్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు