Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సురక్షితమైన సమాజ నిర్మాణంలో పోలీస్ పాత్ర కీలకం

సురక్షితమైన సమాజం నిర్మాణంలో పోలీస్ పాత్ర కీలకం : మంత్రి పువ్వాడ
ఖమ్మం బ్యూరో జూన్ 4(నిజం చెపుతాం)
సురక్షితమైన సమాజం నిర్మాణంలో పోలీస్ పాత్ర చాల కీలకమైనదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎస్ ఎస్ ఆర్ బి జి ఎన్ ఆర్ గ్రౌండ్స్ లో సురక్ష దినోత్సవం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్లు బైక్ ర్యాలీ ని ఎమ్మెల్సీ తాత మధు ఎంపీ నామా నాగేశ్వరావు, ఎంపీ రవిచంద్ర, కలెక్టర్ గౌతమ్ పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి , మేయర్ నీరజ తో కలసి మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు.

ర్యాలీ అనంతరం పాత బస్‌స్టాండు ప్రాంతానికి ర్యాలీ చేరకుంది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
జిల్లాలో శాంతిభద్రతలు అధ్బుతంగా ఉన్నయంటే పోలీస్ యంత్రాంగం పడిన కష్టానికి ఫలితమని అన్నారు.
రాత్రిపగలు తేడా లేకుండా ఆహర్నశలు కష్టపడి సమర్ధవంతమైన సేవలందిచడం ద్వారానే ప్రజలు నిర్భయంగా జీవన విధానాన్ని కొనసాగే పరిస్థితికి సాధ్యమవుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక పోలీస్ సంస్కరణల ద్వారా అరచక శక్తులను అణచివేతతో గడిచిన తొమ్మిది సంవత్సరాలలో ఎక్కడ కూడా చిన సంఘటనలు జరగలేదని అన్నారు.

అదేవిధంగా ఖమ్మం జిల్లాకు పోలీస్ కమిషనరేట్ గా తీర్చిదిద్దటంతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రజలకు గౌరవించే పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.

ఇది కూడా చదవండి….అపదలో ఉన్న మిత్రునికి అండగా నిలిచారు

భారత దేం ఏ రాష్ట్రంలేని విధంగా రాష్ట్ర పోలీస్ వ్యవస్థ అభివృద్ధి చెందిందని, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్రంలో ఏర్పాటు సీసీ కెమెరాల సంఖ్య దేశంలో ఎక్కడ కూడా లేదని,ప్రజలకు అండగా వుంటూ రక్షణ కల్పిస్తున్నారని ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎంపీ రవిచంద్ర అన్నారు.

జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ మహిళ రక్షణకు షీ టిమ్ ఏర్పాటు తో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను ప్రజలకు అందుతున్నాయని అన్నారు.

జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మంజూరు అయిందని తద్వారా సైబర్ నేరాలు వేగవంతంగా కట్టడి చేసేందుకు సాధ్యమవుతుందని అన్నారు. పోలీస్ శాఖ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా జిల్లావ్యాప్తంగా 8477 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

టెక్నాలజీ పరంగా ముందుకు సాగుతుందని అన్నారు. షీ టీమ్ ద్వారా మహిళపై జరుగుతున్న వేధింపులు నియంత్రించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, సుడా చైర్మన్ విజయ్ కుమార్,
ఆడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ , ట్రైనీ ఏసీపీ అవినాష్ కుమార్ ఏసీపీలు ప్రసన్న కుమార్ , గణేష్ , వెంకటస్వామి, వేంకటేశ్వర్లు, రవి పాల్గొన్నారు .