అపదలో ఉన్న మిత్రునికి అండగా నిలిచారు
అపదలో ఉన్న మిత్రునికి ఆర్ధిక సాయం
ఆదర్శంగా నిలిచిన బాల్య స్నేహితులు
కారేపల్లి,జూన్4(నిజం చెపుతాం): చిన్ననాటి మిత్రుడు ఖలీలుల్లాఖాన్ కుటుంబం విధి వక్రీకరించి ఆర్ధికంగా చితికి పోయిన దశలో మేమున్నామంటూ తోటి స్నేహితులు అండగా నిలిచి ఆర్ధిక సాయం చేశారు.
కారేపల్లి హైస్కూల్‌లో 1991`92 సంవత్సర పదోతరగతి విద్యార్ధులు ప్రతి ఏటా సమ్మేళనంను నిర్వహించుకుంటారు.
ఈ ఏడాది మే 28న పూర్వ విద్యార్ధుల సమ్మేళనం అనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఈ సమయంలో తోటి మిత్రుడు ఖలీలుల్లాఖాన్ కుటుంబం అనారోగ్యంతో బాధపడుతుందని తెలుసుకున్నారు.
ఖలిలూల్లాఖాన్ భార్య కిడ్ని వ్యాధితో బాధపడుతూ తప్పని సరిగా కిడ్ని మార్పి చేయాల్సిన పరిస్ధితి. కుమారుడు అఖిల్ ఆప్తమోలజిస్ట్ చదువుతున్నాడు. కుటుంబ పరిస్ధితో చదువు మధ్యలో ఆపివేశాడు.
ఇది కూడా చదవండి…..ప్లాస్టిక్ కళ కళ..భూమాత విలవిల
భార్య చికిత్స కోసం ఆటోను నమ్ముకోని జీవనం సాగిస్తున్నాడు. కిడ్ని దెబ్బతిన్న భార్యకు కిడ్నికి ఇచ్చి కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్న క్రమంలో విధి వక్రీకరించి ఖలిలుల్లాఖాన్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇప్పుడే కోలుకుంటున్నాడు.
బాల్య మిత్రులు బాధలు విన్న తోటి మిత్రులు కళ్లు చెమర్చాయి. వెంటనే అపదలో ఉన్న మిత్రునికి అండగా నిలవాలని తలంచారు.
మిత్రుడి కుటుంబానికి ఆర్ధిక భరోసా
మిత్రులు పూర్వ విద్యార్ధుల సమ్మేళనంలో అనుకున్నదే తడువుగా కోల్‌మైన్స్ ఇండియా లో డిప్యూటీ డైరక్టర్ క్యాడర్‌లో పని చేస్తున్న ఆదెర్ల రాంబాబు తాను రూ.50 వేలు ఇవ్వటంతో పాటుతోటి మిత్రులను ప్రోత్సహించారు.
దీంతో అందరు కలిసి రూ.1.80 లక్షలు కూడ బెట్టారు. వాటిని ఆదివారం కారేపల్లి హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మిత్రుని కుటుంబానికి అందజేశారు. దీంతో మిత్రుడి కంట్లో అనందబాష్పాలు వెలికి వచ్చాయి.
కుటుంబానికి మెరుగైన వైద్య అందటానికి తమ వంతు కృషి చేస్తామని మిత్రులు హామీ ఇచ్చారు. ఈసందర్బంగా సామాజిక విద్యావేత ఎండీ.బాబు మాట్లాడుతూ పూర్వం విద్యార్ధులకు విలువలతో కూడి విద్య నందించేవారమన్నారు.
దాని ఫలితమే తోటి వారికి సాయం చేసే గుణం అలవడిరదన్నారు. మిత్రుడు అపధ ఉన్నడని, అతని బాధను తమబాధగా తలంచి సాయం చేయటం హర్షదాయకమన్నారు.
ఈకార్యక్రమంలో మిత్ర బృందం శశిధర్, జాకిర్ బాబా, గొడుగు శ్రీను, తొగర రమేష్, ఓరుగంటి రంగనాధ్, ఎస్‌కె.మతీన్, తుమ్మలపల్లి కోటేశ్వరరావు, సిహెచ్.కమల, నహీమ్, సలీం, కోట రవి, చింతల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.