Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్లాస్టిక్ కళ కళ..భూమాత విలవిల

దైవత్వానికి ఉండేది పరిశుభ్రమైన పరిసరాలే

– ఎన్.సి.సి అధికారి గుండెల్లి రాజయ్య

జయశంకర్ భూపాలపల్లి జిల్లా జూన్ 04 (నిజం చెపుతాం)

ప్లాస్టిక్ నేడు కలకాల లాడుతూ..భూమాత విలవిలలాడుతూ..ఉందని
“పరిసరాల పరిరక్షణ దినోత్సవం “సందర్భంగా పదవ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ నంద కందూరి ఆదేశాల మేరకు మండలంలోని జడ్పీహెచ్ఎస్ మొట్లపల్లి పాఠశాల ఎన్.సి.సి అధికారి రాజయ్య ఆధ్వర్యంలో ఎన్.సి.సి విద్యార్థులు అవగాహన ర్యాలీని నిర్వహించారు.

ఈ ర్యాలీలో విద్యార్థులు గ్రామంలోని వీధుల వెంట తిరుగుతూ ప్లాస్టిక్ ను వాడకూడదని.. ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్ధాలకు సంబంధించిన ప్లేకార్డులను చేతభూని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

అనంతరం పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ..మనిషి తన స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నారని, తన మేదో సంపత్తితో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని, ప్రపంచ వ్యాప్తంగా పలు ఎలక్ట్రానిక్ పరిశ్రమలను నెలకొల్పుతున్నారని, ఈ పరిశ్రమల వల్ల వెదజల్లే కాలుష్యంతో కోలుకోలేనంతగా వాతావరణం కలుషితమై “పీల్చే గాలి” “తాగే నీరు” “తినే ఆహారం” అన్ని కలుషితమవుతున్నాయని, దీనికి తోడు ప్రతి అవసరానికి “ప్లాస్టిక్ నే” వాడడం, దాని వ్యర్ధాల వల్ల అది భూమిలో కలవడానికి ఎక్కువ సంవత్సరాలు పడుతుంది.

కాబట్టి భూమి సారవంతతను కోల్పోతుందని, ఈ రకంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సాధించిన పురోగతి కూడా ప్రకృతి కాలుష్యానికి కారణం అవుతుందని, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ లాంటి విష వాయువులు వాతావరణంలో పరిమితికి మించి చేరడం వల్ల క్రమంగా భూమండలం వేడెక్కుతుందని, తద్వారా ‘అడవులు” “జలవనరులు” తగ్గిపోతున్నాయన్నారు.

దానికి తోడు అవసరానికి మించి ప్లాస్టిక్ వాడడం, వాటి వ్యర్ధాలను ఎక్కడ పడితే అక్కడే పారవేయడం వలన సమస్త ప్రాణ కోటికి అనగా జంతువులు, పక్షులు, మానవుని మనుగడకు అవసరమైన క్రిమి, కీటకాలతో పాటు మానవులు అనేక వ్యాధులకు గురి అవ్వడమే కాకుండా..మరణాలు కూడా సంభవిస్తున్నాయని, ఈ కాలుష్యం వల్ల నేడు మానవుని మనుగడే ప్రమాద స్థాయికి చేరిందన్నారు.

ఇది కూడా చదవండి….పాకాల హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి

ఈ విధంగా కలుషితం కావడం వల్ల భూతాపం పెరిగి భూగోళం అగ్ని గోళంగా మారుతుందని, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని, మరియు ప్రళయాలు సంభవిస్తాయని తెలియజేశారు.

అందువల్ల ఎన్.సి.సి క్యాండేట్స్ గా పరిసరాల పరిరక్షణపై అవగాహన కలిగి ఉండి, ప్రజలలో అవగాహన కల్పించడం ప్లాస్టిక్ ను వాడకుండా ప్రత్యామ్నాయంగా జనపనార సంచులు, క్లాత్ సంచులు, కాగితపు సంచులు వాడడంతోపాటు ఎక్కువ మొత్తంలో చెట్లను నాటడం వాటిని పరిరక్షించడం భూమి మీద జీవించు జీవరాశులకు రక్షణ కల్పించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వి నరసింహ స్వామి, గ్రామ సర్పంచ్ నరహరి పద్మ వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ నరహరి కల్పన, ఉప సర్పంచ్ విష్ణు, వార్డ్ మెంబర్లు, ఉపాధ్యాయులు ఏ. సంపత్ కుమార్, బి. వీరయ్య, కే.రవీందర్, గ్రామ యువకులు మరియు ఎన్.సి.సి విద్యార్థులు పాల్గొన్నారు.