Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పూర్వ విద్యార్ధుల సమ్మేళనం

బొమ్మలరామారం: 04(నిజం చెపుతాం)

యాదాద్రి భువనగిరి బొమ్మల రామరం మండల పరిధిలోని మర్యాల గ్రామ జడ్పీ హైస్కూల్ 2010-2011 బ్యాచ్ కు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహంగా జరిగింది.

చాలా రోజుల తర్వాత పాఠశాల ప్రాoగణానికి చేరుకున్న వారంతా ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి….మండు వేసవిలో నిండు వసంతం

ప్రస్తుతం వారి కుటుంబ విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆనాడు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

అనంతరం భోజనాలు చేసి సందడిగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, గౌస్, జాంగిర్ అలీ, అరుణ, కృష్ణమూర్తి, విద్యార్థులు అనిల్, శ్రవణ్, అదిల్ బాలకృష, విజయ్, శ్యాంబాబు, నరేష్, వీరేష్, బిక్షపతి, గణేష్, నరేందర్, కళ్యాణి, ఉమారాణి, మహేశ్వరి, విద్యార్థులు తదితర  పాల్గొన్నారు.