Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మండు వేసవిలో నిండు వసంతం

తూర్పుగోదావరి జిల్లా (బిక్కవోలు మండలం)
జూన్ 4, నిజం చెపుతాం న్యూస్

ఎండాకాలం వచ్చిందంటే ప్రతి చెట్టు భానుడి తాపానికి భగభగలాడుతూ వాడిపోవటం సహజం.

కాని రాయల్ పోయిన్సియానా గా పేర్కొనబడే వృక్షాలు మాత్రం వేసవిలో ఎర్రని పూలతో చూపరులను ఆకర్షిస్తూ కనులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.

మన తెలుగు ప్రాంతాల్లో తురాయి చెట్టుగా పిలువబడే ఈ చెట్లు రహదారులకు ఇరువైపులా,కాలువ గట్లపై,పొలంగట్లపై ఎక్కువగా కనిపిస్తాయి.ఈ చెట్లను కోడిపుంజు పూల చెట్లుగా పల్లెటూర్లలో వ్యవహరిస్తారు.

ఇది కూడా చదవండి…..కుప్పకూలిన కటౌట్.. తప్పిన పెను ప్రమాదం

ఈ చెట్లు బిక్కవోలు మండలం మెళ్ళూరు గ్రామం నుండి మెళ్ళూరు జంక్షన్ వెళ్లే దారిలో లెక్కకు మిక్కిలిగా ఉండి కొత్త శోభతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

ఈ విషయంపై మోడరన్ కాలేజీ సైన్స్ (భౌతికశాస్త్రం)అధ్యాపకులు చల్లా శివ అమ్మిరాజును మరిన్ని వివరాలు కోసం సంప్రదించగా ఈ చెట్లను ఫ్లమ్ బోయంట్ గా కూడా పిలుస్తారని, ఇవి 20 నుండి 40 అడుగుల ఎత్తు పెరుగుతాయని,

వేసవిలో నీటి ఎద్దడి తట్టుకుని చెట్టంతా పూలతో వికసించడం వీటి ప్రత్యేకత అని, మండు వేసవిలో సైతం నిండు వసంతంలా అందరి కళ్ళు తమ వైపు తిప్పుకోవడం వీటికే చెల్లిందని పేర్కొన్నారు.

ఈ విధంగా రోహిణి కార్తెలో సైతం ఎర్రని పూలపందిరి వేస్తున్న తురాయి చెట్లు ప్రజలకు హాయిని కలిగిస్తున్నాయి