Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కుప్పకూలిన కటౌట్.. తప్పిన పెను ప్రమాదం

*గాలివానకే కుప్పకూలిన కటౌట్.. తప్పిన పెను ప్రమాదం*

సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ 4 జూన్ (నిజం న్యూస్)

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ కటౌట్లు ఏర్పాటు చేశారు. అంత సాఫీగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కొరవడంతో ఏర్పాటుచేసిన ఆ భారీ ఫ్లెక్సీ కటౌట్లు చిన్న గాలివానికే పడిపోవడంతో సంగారెడ్డి పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన దశాబ్ది ఉత్సవాల భారీ కటౌట్ గాలి దుమారానికి కూలి నేలకొరిగింది. ఈ సమయంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Also read: రెండే రెండు అక్షరాల ప్రేమ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌

ఫ్లెక్సి లతో ప్రాణాలు పోతున్నాయంటు జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఫ్లెక్సీ కటౌట్లు ఏర్పాటు చేసే ముందు గట్టి భద్రత బందోబస్తు మధ్య ఏర్పాటు చేయాలని ఖాళీ చిన్న గాలివానికే ఈ విధంగా పడిపోతే ప్రజల ప్రాణాలకు ముప్పే అంటూ పట్టణ వాసులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నామంటూ వారు చెబుతున్నారు.