భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం ఎన్నిక
ఉషారాణి *సెక్రెటరీ-ఎస్.విజయ *కోశాధికారి-ఎస్.శ్వేత చంద్రుగొండ/అన్నపురెడ్డిపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సంఘంలో సభ్యులు మొత్తం 11 మంది ఉండగా వారి నుండి అధ్యక్షురాలిగా చండ్రుగొండ మండలం,బెండాలపాడు గ్రామానికి చెందిన కుంజా.ఉషారాణి, సెక్రటరీ గా ఇల్లందు కు చెందిన ఎస్.విజయ, కోశాధికారి గా జూలూరుపాడు కు చెందిన ఎస్.శ్వేతా,లను ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షురాలు గా గిరిజన మహిళ ఉషారాణి ని ఎన్నుకోవడం ఎంతో అనందనీయమని, బెండాలపాడు గ్రామ మహిళా రైతు సంఘం సభ్యులు హర్షం వ్యక్తంచేశారు.ఉషారాణి మాట్లాడుతూ మహిళా రైతు సంఘాల కు అండగా ఉంటానని, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్.పి.ఓ) అభివృద్ధి కి తన శక్తి మేరకు కృషి చేస్తామన్నారు.