Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

స్వీడన్‌ లోని గోథెన్‌బర్గ్‌లో సెక్స్ టోర్నమెంట్…?

ప్రపంచంలో ఫస్ట్ టైమ్.. సెక్స్ టోర్నమెంట్?

మహబూబాబాద్ బ్యూరో జూన్ 04 నిజం న్యూస్

స్వీడన్ : జూన్ 04
ఇప్పటి వరకూ ఫుట్ బాల్ టోర్నమెంట్ చూసి ఉంటారు.. బాస్కెట్ బాల్ టోర్నమెంట్ చూసి ఉంటారు.., క్రికెట్ టోర్నమెంట్ చూసి ఉంటారు. అయితే ప్రపంచంలో మెుదటిసారిగా.. సెక్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజంగా నిజం.

ఇప్పటి వరకు.. క్రికెట్, ఫుట్ బాల్ టోర్నమెంట్స్ చూసి ఉంటారు. ఇక రోజులు మారాయి. ఇప్పుడు కొత్త రకం టోర్నమెంట్ చూడబోతున్నారు. అదే రతి క్రీడా పోటీలు. ప్రపంచంలో ఇలా ఎప్పుడూ లేదు. మెుదటిసారిగా సెక్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.

మరికొన్నిరోజుల్లో రతి క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ సెక్స్ టోర్నమెంట్ జూన్ 8 నుండి స్వీడన్‌ లోని గోథెన్‌బర్గ్‌లో మెుదలవుతాయి. స్వీడన్ సెక్స్‌ను అధికారిక క్రీడగా ప్రకటించింది. పైన పేర్కొన్న తేదీ నుండి సంబంధిత టోర్నమెంట్‌లు దేశంలో జరుగుతాయి.

ఆ మధ్య కాలంలోనూ స్వీడన్ దేశం కొత్తరకం రూల్ తో ముందుకు వచ్చింది. ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు డ్యూటీ మధ్యలో సెక్స్(Sex) కోసం ఒక గంట పెయిడ్ పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

Also read: రూపాయి కన్నా తక్కువకు.. రూ 10 లక్షలు రైల్వే బీమా

అయితే తాజాగా ఏకంగా రతి క్రీడా పోటీలనే నిర్వహిస్తోంది. ఇప్పుడు ఈ వార్త వైరల్ అయింది. జూన్ 8వ తేదీ నుంచి గోథెన్ బర్గ్ లో ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ క్రీడా పోటీలు నిపుణుల పర్యవేక్షణలో జరుగుతాయి. న్యాయనిర్ణేతల అభిప్రాయాలతో గెలుపోటములు నిర్ణయిస్తారు.

ఇలా రతి క్రీడా పోటీలు నిర్వహించడం ప్రపంచంలో ఇదే ఫస్ట్ టైమ్. ఇందులో ఆడా, మగా ఎవరైనా పాల్గొనవచ్చు. అయితే ఒక కండీషన్ ఉంది.. సెక్స్ టోర్నమెంట్ లో రోజుకు 6 గంటలపాటు పాల్గొనాలి. అంటే రోజుకు ఆరు గంటలు అలసిపోవాలన్నమాట.

ఈ టోర్నమెంట్లో ఊరికనే పాల్గొంటే గెలవరు. చాలా రకాలుగా ప్రయత్నం చేస్తేనే విజయం సాధిస్తారు. మసాజ్, ఓరల్ సెక్స్, అందమైన భంగిమలు, కష్టమైన భంగమలు ఇలా అన్నింటిని ట్రై చేసి.. మెప్పించాలి. మరో విషయం ఏంటంటే.. సెక్స్ చేస్తే సరిపోదు.. అందుకు తగ్గట్టుగా చేసే శబ్దాలు కూడా గెలుపు ఓటములను నిర్ణయిస్తాయి.

ఈ టోర్నమెంట్ ప్రారంభమైతే.. ఇంటర్నెట్ షేక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏదేనా సైట్ లో లైవ్ ఇస్తే మాత్రం.. వ్యూయర్ షిప్ ఘోరంగా వస్తుంది. ఈ రతి క్రీడలను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు…