Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఒడిశా రైలు ప్రమాద ఘటనతో 18 రైళ్లు తాత్కాలికంగా రద్దు

ఒడిశా రైలు ప్రమాద ఘటనతో 18 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 33 రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు.

12837 హౌరా`పూరీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, 12863 హౌరా`బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, 12839 హౌరా`చెన్నై మెయిల్‌ రద్దు చేసినట్లు అధికారి తెలిపారు.

12895 హౌరా`పూరీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, 20831 హౌరా`సంబల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌, 02837 సంత్రాగచ్చి`పూరీ ఎక్స్‌ప్రెస్‌లను కూడా రద్దు చేసినట్లు  వారు తెలిపారు.

ఇది కూడా చదవండి….ఆందోళన చేయడమే నేరమా…?

బెంగళూరు`హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌`చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ , గూడ్స్‌ రైలు ప్రమాదానికి గురై233 మంది మరణించగా 900 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ పరిహారం ప్రకటించింది.

మృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.