Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆందోళన చేయడమే నేరమా…?

మెడల్స్‌ గంగలో విసిరేసినా చలనం రాదేమో..!
మహిళలకు అండదండలు లేవని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరోమారు నిరూపించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా దేశ కీర్తిపతాకన ఎగురేసిన మహిళా రెజ్లర్ల విషయంలో అనుసరిస్తున్న వైఖరి మోడీ లేదా బిజెపి ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్టగా చూడాలి.

తప్పు ఎవరిదైనా ఓ బిజెపి ఎంపి తమపట్ల అసభ్యంగా ప్రవర్తిం చాడని, లైంగిక వేధింపులకు గురి చేశాడని ఎలుగెత్తి నెత్తీ నోరు మొత్తుకుంటున్నా..చీమకుట్టినట్లు కూడా లేదు.

కనీసం మహిళా ఎంపిలు కూడా వారిపట్ల సానుభూతి చూపడం లేదు. నిజానికి ఇది చిన్న సమస్య కాదు. దేశం తలదించుకునే సమస్య. తమ పతకాలను గంగలో విసిరి పారేస్తామన్నా ప్రభుత్వంలో చలనం కానరావడం లేదంటే..ఇంతకన్నా అవమానం మరోటి ఉండబోదు.

బిజెపి ఎంపి బ్రిజ్‌మోహన్‌ ఇక్కడ దోషి. ఆయన రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు కావడమే అసలు సమస్య. ఈ విషయంలో రెజర్ల ఆరోపణల్లో నిజానిజాలు వెలికి తీయాలి. కానీ అలా జగరడం లేదు. కనీసం వారిని చర్చలకు పిలిచి..సానుకూలతను వ్యక్తం చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

బరితెగించిన పాలనకు ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు. నెలల తరబడి మహిళలు ఆందోళన చేస్తుంటే చేష్టలుడిగిన పాలకులు, ఎంపిలు ఢల్లీిలో చోద్యం చూస్తున్నారు. మహిళా మంత్రులుగా ఉన్న నిర్మలా సీతారామన్‌,స్మృతి ఇరానీ లాంటి వారంతా వారిని కలసి సమస్య గురించి ఆరాతీసి వుంటే గగౌరవం పెరిగేది. కానీ అలా జరగలేదు.

బేఠీపడావో..బేఠీ బచావో అంటున్న మోడీ కూడా ఈ సమస్యను చిన్నదిగానే చూశారు. ఇంతకన్నా రాక్షసత్వం మరోటి ఉండదు. మహిళా రెజ్లర్లను పిలిచి ముందుగా వారు ఆందోళన విరమించేలా చేసి… నిజానిజాలు వెలికితీసివుంటే ప్రభుత్వ సచ్ఛీలత బయటపడేది. ఇకపోతే వారికి అన్ని వర్గాల నుంచి క్రమంగా మద్దతు పెరుగుతోంది.

తాజాగా క్రికెటర్లు కూడా పూర్తి మద్దతు ప్రకటించారు. ఇకపోతే ఇటీవల పార్లమెంట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా వారు ఆందోళనకు దిగి తమ సమస్య తీవ్రతను తెలియచేసే ప్రయత్నం చేశారు. అయితే మహిళా రెజ్లర్లపై రాజధాని ఢల్లీి వీధుల్లో పోలీసుల కిరాతకం బిజెపి ప్రభుత్వ నిరంకుశానికి పరాకాష్టగా నిలచింది.

మన ప్రజాస్వామ్యానికి దేవాల యంగా అభివర్ణించే నూతన పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవం రోజున రెజ్లర్లపై దమనకాండకు దిగింది. తమను లైంగికంగా, మానసికంగా వేధించిన బిజెపి పార్లమెంట్‌ సభ్యుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోమనడమే రెజ్లర్లు చేసిన నేరం.

బ్రిజ్‌ భూషణ్‌పై చర్యల కోసం ఐదు వారాలుగా ఢల్లీి జంతర్‌మంతర్‌ వద్ద రెజ్లర్లు సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. మోడీ సర్కారు స్పందించక పోవడంతో నూతన పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవంనాడు ’మహిళా మహా పంచాయత్‌’కు పిలుపు నిచ్చారు. పార్లమెంట్‌కు మార్చ్‌గా వెళుతున్న రెజ్లర్లను పోలీసులు బలవంతంగా అడ్డుకొని మహిళలని కూడా చూడకుండా రోడ్లపై ఈడ్చిపారేశారు.

ఇది కూడా చదవండి…..వ్యాపారం లో ప్రతిభ చూపిన వారికి టీవీ15 సిబా అవార్డ్స్

ఎక్కడికక్కడ బస్సుల్లోకి ఎత్తిపడేసి వాహనాల్లో కుక్కి పోలీస్‌ స్టేషన్లకు తిప్పారు. అరెస్టులు చేసి..అక్రమ కేసులు బనాయించారు. బిజెపి ప్రభుత్వ పైశాచికంపై వినేశ్‌ ఫొగాట్‌ వంటి వారు కన్నీరు పెట్టుకున్నారు. రెజ్లర్ల ఆందోళనకు మద్దతుగా నిలిచిన ప్రజాసంఘాలకు చెందిన మహిళా నేతలను,రైతు నాయకులను ఢల్లీి సరిహద్దులు మూసేసి మరీ అడ్డుకున్నారు.ఇంతకన్నా దారుణం.. దౌర్భాగ్యం మరోటి ఉండదు.

ఆందోళన చేయడమే నేరమన్నట్లుగా పరిస్థితి కనిపించింది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షునిగా ఉన్న సమయంలో బ్రిజ్‌ భూషణ్‌ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారన్న అభియోగం విషయంలో వారు గట్టిగానే నిలబడ్డారు. అటువంటి ఆరోపణలొచ్చిన వెంటనే బాధ్యత గల ప్రభుత్వమేదైనా దర్యాప్తు చేసి నిందితుడిని శిక్షించాల్సింది. కానీ అలా జరగలేదు. తమకు న్యాయం చేయాలని ఏప్రిల్‌ 23 నుంచి రెజ్లర్లు ఢల్లీిలో ఆందోళన చేస్తున్నారు.
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పట్టించు కోవడంలేదని వారి ఆందోళనలు చూస్తే అర్థం అవుతోంది. దేశానికి పతకాలు సాధించిన క్రీడాకారులు రోడ్డున పడ్డారన్న బాధ ఏ కోశాన కనిపించడం లేదు. రెజ్లర్ల పోరాటానికి వివిధ వర్గాల నుంచి క్రమేపి మద్దతు పెరుగుతోంది.

బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలంటూ 1,150 మందికి పైగా మేధావులు ప్రధానికి లేఖ రాశారు. మూడు నల్ల వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢల్లీి సరిహద్దుల్లో ఏడాదికిపైగా రైతులు నిర్వహించిన వీరోచిత పోరాటం మాదిరి రెజ్లర్ల ఆందోళన రూపుదిద్దుకుంటోంది. ఎంతగా నిర్బంధం అమలు చేసినా తమ పోరాటం ఆగదని రెజ్లర్లు ప్రకటించి మొక్కవోని దీక్ష కనబర్చడం కంటనీరు పెట్టిస్తోంది.

ప్రజాస్వామ్యం, మహిళలు, గగౌరవం, భారత సంస్కృతీ సంప్రదాయాల గగురించి గొప్పలు చెబుతున్న ప్రధాని మోడీవన్నీ వాగాడంబరాలే అని తేలింది. మహిళా రెజ్లర్లపై పోలీస్‌ దౌర్జన్య కాండకు తోడు.. బిజెపి ఎంపి పట్ల చర్యలు తీసుకునే ప్రయత్నం కానరావడం లేదు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు రాజ్యాంగం పౌరులకు కల్పించింది.

ఇది కూడా చదవండి…..రోహిణి కార్తె లోపలే సాగును చేపట్టాలి

భావ ప్రకటనా స్వేచ్ఛ ఇచ్చింది. మహిళా రెజ్లర్లు తమను వేధించిన ఎంపి.ని అరెస్టు చేయమంటుండగా, నిందితుడిని వెనకేసుకుని వస్తున్న బిజెపి ఇక మహిళలకు న్యాయం చేస్తుందని అనుకోవడం భ్రమ. రెజ్లర్లను లైంగికంగా వేధించే హక్కు బ్రిజ్‌ భూషణ్‌కు దఖలు పర్చినట్లుగా ఉందా అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వం చెల్లదు. లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఎంపి బ్రిజ్‌ భూషణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యం గురించి మోడీ గొప్పలు చెప్పడం మాని అసలు నిజాలు కనుక్కోవాలి. మరోవైపు డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ శరన్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేయాలంటూ రెజ్లర్ల చేస్తోన్న ఆందోళనకు క్రమంగా అన్ని వర్గాల మద్దతు లభిస్తోంది.

ఇప్పటికే ప్రపంచ రెజ్లింగ్‌ సమాఖ్య, అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) రెజ్లర్లకు అండగా నిలవగా, తాజాగా 1983 వరల్డ్‌ కప్‌ హీరోస్‌ టీం కూడా వారికి మద్దతు తెలిపింది. ఢల్లీి వేదికగా గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న భారత మహిళా రెజ్లర్లకు 1983లో క్రికెట్‌ వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టు మద్దతు ప్రకటించింది.

ఢల్లీిలో భారతదేశపు ఛాంపియన్‌లు అయిన మహిళా రెజ్లర్లను మ్యాన్‌ హ్యాండిల్‌ చేసిన తీరును చూసి మేం చాలా వేదనకు, వ్యాకులతకు గురయ్యాం. ఎంతో కష్టపడి సాధించిన పతకాలను వారు గంగానదిలో పడే యాలనే ఆలోచనకు రావడం ఎంతో బాధపెట్టింది.

ఎందుకంటే ఆ పతకాల్లో ఏళ్ల తరబడి చేసిన శ్రమ, త్యాగం, సంకల్పం దాగి ఉంటుంది. అంతేగాక వారు గెలిచిన పతకాలు వారికే కాదు, దేశానికే గర్వకా రణం. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని వారు రెజ్లర్లను కోరుతూనే…తమ పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు.

నిజానికి ఇప్పటికే ఆలస్యం అయ్యింది. ఇకనైనా ఉపేక్ష లేకుండా ప్రభుత్వం చర్యలకు దిగాలి. రెజ్లర్లకు స్వాంతన చేకూర్చాలి.