Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వ్యాపారం లో ప్రతిభ చూపిన వారికి టీవీ15 సిబా అవార్డ్స్

నోవాటల్ లో జూన్ 25న టీవీ15 సిబా అవార్డ్స్…
గండిపేట్, జూన్ 03( నిజం చెపుతాం న్యూస్): టీవీ15 ఛానల్ నిర్వహిస్తున్న ( ఎస్ఐబిఏ) స్టెల్లార్ ఇండియన్ బిజినెస్ అవార్డ్స్ బ్రోచర్ని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వాకుళ భరణం కృష్ణ మోహన్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు విభాగాలలో వ్యాపారం లో ప్రతిభ కనబరిచినందుకు ప్రతిష్టాత్మక అవార్డులను జూన్ 25న నోవాటల్ లో టీవీ 15 సీబా అవార్డ్స్ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి….రోహిణి కార్తె లోపలే సాగును చేపట్టాలి

అత్యంత పారదర్శకత సమగ్రతతో ప్రతి విభాగంలోని విజేతలను గౌరవిస్తామని, దేశ విదేశాల నుండి వచ్చిన పారిశ్రామికవేత్తల చాతుర్యం ప్రతిభాను సంబరాలు చేసుకోవడంలో ఏకమవుతున్నట్లు తెలిపారు.

ఇక్కడ నామినేషన్లకు ఎటువంటి రుసుము లేదని, అన్ని రంగాలకు చెందిన వ్యాపారులు సంస్థలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

ఆతిథ్యం తదితర రంగాలలో అవార్డ్స్ అందజేస్తారని నిర్వాహకులు టీవీ 15 బ్రైట్ హౌస్ బ్రాడ్ కాస్టింగ్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సయ్యద్ బాబ్, మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో షేక్ రఫీ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిస్సెస్ ఆసియా సుధాజైన్, రౌనక్ యార్ ఖాన్, అనిత హరి,కుమార్ తదితరులు పాల్గొన్నారు