Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వరి కొయ్యలకు పెట్టిన నిప్పు…దగ్ధమైన పెళ్లి డెకరేషన్ సామాగ్రి

పెళ్లి డెకరేషన్ సామాగ్రి దగ్గం

వరి కొయ్యలకు నిప్పు పెట్టడమే కారణం

నేరేడుచర్ల, జూన్ 3 నిజం న్యూస్: నేరేడుచర్ల మున్సిపాలిటీ రిధిలోని పి.వన్ పంక్షన్ హాల్ ఆవరణలో శుభకార్యా ల కోసం ఉంచిన పెళ్లి డెకరేషన్ సామాగ్రి శనివారం దగ్ధమై  భారీగా ఆస్థి నష్టం వాటిల్లింది.

గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన మచ్చ మధు శుభకార్యాలకు, పెళ్లిలకు డెకరేషన్ చేస్తూ జీవి స్తున్నాడు. ఈ సందర్భంగా ఏ.వన్ పంక్షన్ హాల్ అవరణలో సమాగ్రి ని భద్రపర్చి పంక్షను తీసుకవెళ్తుంటాడు.

ALSO READ: పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు రెడీ

పంక్షన్ హాల్ పట్టణ శివారులో పొలాలకు అనుకొని ఉండడంతో కొందరు రైతులు వరి కొయ్యలకు నిప్పు పెట్టారు. దీంతో క్రమేపీ మంటలు వ్యాపించి పంక్షన్ హాల్ ఆ వరణలో ఉంచిన సమాగ్రి అంటుకొని దగ్ధమైనాయి.

అనైతిక పద్ధతిలో నిప్పు పెట్టడం వల్లనే సుమారు 5లక్షలకు పైగా తన సమాగ్రి అగ్నికి అహుతి అయింద ని సంబంధిత రైతులపై చర్యలు తీసుకోని తనకు నష్టప రిహారం ఇప్పించాలని బాధితుడు కోరుతున్నాడు.