Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఢిల్లీ తెలంగాణ భవన్ లో యువతి ఆత్మహత్యాయత్నం..!

బీఆర్ఎస్ ఎంఎల్ఎ దుర్గం చిన్నయ్యపై లైంగిక ఆరోపణలు చేస్తున్న ఆరిజన్ డైరీ నిర్వాహకురాలు షేజల్ ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు.

తనను ఎంఎల్ఎ మానసికంగా వేదింపులకు గురి చేస్తున్నారని, ఆయన అనుచరులు సైతం వేధిస్తున్నారని నాలుగు రోజులుగా ఢిల్లీ లో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Also read: త్వరలో…రూ.500 నోట్ల రద్దు?

ఈ రోజు ఏకంగా ఆత్మహత్యాయత్నం చేశారు. ఢిల్లీ తెలంగాణ భవన్ పార్కింగ్ ఏరియాలో శేజల్ విషం తాగారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు నా గురించి అసభ్యకరమైన వార్తలు వేస్తున్నారు నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేస్తుండటంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను.

గోలి శివ, ఇంకో వ్యక్తి నా తప్పుడు ప్రచారం చేస్తూ చంపుతా బెదిరిస్తున్నారు. నేను పలుమార్లు తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు నా కేసులను నమోదు చేయకపోగా తప్పుడు కేసులో తిరిగి నా మీది పెడితూ నన్ను చిత్ర హింసకు గురిచేస్తున్నారు.