Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

త్వరలో…రూ.500 నోట్ల రద్దు?

మహబూబాబాద్ బ్యూరో జూన్ 2 నిజం న్యూస్

ఈమధ్యే రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంది భారత రిజర్వ్ బ్యాంక్ (RBI). ఐతే.. ఇప్పుడు RBIకి రెండు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. అవి 1. రూ.500 నోట్ల కొరత 2. నకిలీ రూ.500 నోట్లు.

నోట్ల కొరత : ఎప్పుడైతే.. రూ.2000 నోట్లను RBI ఉపసంహరించుకుందో… అప్పుడు ఆ నోట్లను అక్రమంగా దాచుకున్న వారు.. ఇప్పుడు వాటిని మార్చుకొని… రూ.500 నోట్లను తీసుకుంటున్నారు. వాటిని దాచేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా రోజూ వేల కోట్ల రూపాయల రూ.500 నోట్లు మాయమవుతున్నాయి.

Also read: తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిన కేంద్ర ఎన్నికల సంఘం

నకిలీ నోట్లు : ఎప్పుడైతే రూ.2000 నోటును RBI ఉపసంహరించిందో… వెంటనే రూ.500 నోట్లకు డిమాండ్.. 4 రెట్లు పెరిగింది. దాంతో.. ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని.. నకిలీ నోట్ల మాయగాళ్లు రెడీ అయిపోయారు. ఇష్టమొచ్చినట్లు రూ.500 నోట్లను నకిలీవి ముద్రిస్తూ… దేశవ్యాప్తంగా మార్పిడి చేస్తున్నారు. అందువల్ల ఇండియాలో రూ.500 నోట్లలో ఏది నిజమైనదో, ఏది నకిలీదో తెలియని పరిస్థితి వచ్చేసింది.

ఈ నకిలీ నోట్లను పాకిస్థాన్‌లో ముద్రిస్తున్నారు. వాటిని నేపాల్, బంగ్లాదేశ్ వైపు నుంచి ఇండియాలోకి తరలిస్తున్నారు.