Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఒడిశాలో రైలుపట్టాలపై మరణ మృదంగం

…233 మంది దుర్మరణం

బాలేశ్వర్: ఒడిశాలో రైలుపట్టాలపై మరణ మృదంగం మోగింది. రెండు సూపర్ ఫాస్ట్ రైళ్లు, ఓ గూడ్స్ రైలు ఢీకొనటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 233 మంది దుర్మరణం చెందారు.

900 మందికి పైగా గాయాలపాలయ్యారు. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్లోని హావాకు వెళ్తున్న బెంగళూరు- హావ్రా సూపర్ఫస్ట్ ఎక్స్ ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది.

ఇది కూడా చదవండి…..దైవదర్శనానికి వెళ్లొస్తూ …నలుగురు మృత్యువాత

ఫలితంగా దాని పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్ పై పడిపోయాయి. వాటిని షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. దాంతో కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి.

అనంతరం.. బోల్తాపడ్డ కోరమండల్ కోచ్లను పక్కనున్న ట్రాక్పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది.