ఇక నుండి టీమిండియాకు బిజీ షెడ్యూల్
ఓవల్‌లో ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడేందుకు టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లాండ్‌కు బయలుదేరారు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత జట్టుకు నెల రోజుల విశ్రాంతి లభించే అవకాశం ఉందని సమాచారం.
జూన్ 20 నుండి 30 వరకు ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు వన్డే మ్యాచ్‌ల హోమ్ సిరీస్ ఆడాల్సి ఉంది. కాని ఆటగాళ్ల పనిభారం, ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఆ సిరీస్ ను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జూలై-ఆగస్టులో వెస్టిండీస్‌లో భారత పర్యటన
వచ్చే నెలలో టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించనుంది, జూలై 12 నుంచి ఆగస్టు 31 వరకు ఇరు జట్లు 2 టెస్టు మ్యాచ్‌లు, 3వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లను ఆడనున్నాయి. .
ఆసియా కప్ 2023 సెప్టెంబర్‌లో
సెప్టెంబరులో ఆసియా కప్ 2023 కోసం పాకిస్తాన్‌లో పర్యటించడానికి భారతదేశం సుముఖంగా లేదు. అయితే వేదిక ఎక్కడ అనేది ఇంకా సందిగ్ధత నెలకొంది. ఈ కారణంగా, ఆసియా కప్ 2023 షెడ్యూల్ కూడా ఇంకా విడుదల కాలేదు. ఈ టోర్నీలో మొత్తం 12 వన్డే మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.
ఇది కూడా చదవండి….కప్పు కొట్టాలన్న కసితో భారత్
సెప్టెంబర్-అక్టోబర్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా
ఆసియా కప్ తర్వాత, వన్డే ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాతో భారత్ సొంతగడ్డపై 3వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.
అక్టోబర్-నవంబర్‌లో వన్డే ప్రపంచ కప్
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే సిరీస్ తర్వాత భారత్ వన్డే ప్రపంచ కప్ 2023కి ఆతిథ్యం ఇవ్వనుంది. 12 ఏళ్ల తర్వాత భారత్ లో వన్డే ప్రపంచకప్ జరగనుంది.
నవంబర్ చివరి నుంచి డిసెంబర్ ఆరంభం వరకు భారత గడ్డపై జరిగే మెగా ఈవెంట్‌లో మొత్తం 48 మ్యాచ్‌లు జరుగుతాయి.
డిసెంబర్ లో దక్షిణాఫ్రికా పర్యటన
2023 జనవరి 2024 వరకు దక్షిణాఫ్రికా తో 2 టెస్ట్‌లు, 3 ODIలు, 3 T20Iలను ఆడనుంది.