Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గీతా ఆర్ట్స్ లో బాలయ్యతో భారీ సినిమా

గీతా ఆర్ట్స్‌ నుంచి భారీ చిత్రాలు రాబోతున్నాయని అల్లు అరవింద్ తెలిపారు. వాటిలో  మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి దర్శకుడుగా ఓ భారీ సినిమా తెరకెక్కనున్నట్లు అల్లు అరవింద్‌ తెలిపాడు. బాలయ్యతో సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కే చాన్స్‌ ఉంది.

ధృవ టైమ్‌ లో అరవింద్‌.. సురేందర్‌ రెడ్డి అడ్వాన్స్‌ ఇచ్చాడని,  ఈ సినిమా అల్లు అర్జున్‌ తోనే ఉండే అవకాశం ఉంది.

యంగ్‌ డైరెక్టర్‌ చందూ ముండేటితో ఏకంగా మూడు సినిమాలను చేయబోతున్నట్లు అల్లు అరవింద్‌ ప్రకటించాడు. అందులో ఒకటి ఏకంగా రూ.300 కోట్ల బ్జడెట్‌ తో ఓ భారీ సినిమా కూడా ఉండనుందట. తమిళ హీరో సూర్య ఈ ఆ భారీ ప్రాజెక్ట్‌ చేయబోతున్నట్లు సమాచారం.

నాగచైతన్యతో ఒకటి, హిందీ నటుడు కార్తిక్‌ ఆర్యన్‌ తో ఒక సినిమా చేయనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి….రెండు భాగాలుగా రానున్న పెదకాపు

బాలయ్యతో ఓ హై బ్జడెట్‌ సినిమా చేయబోతున్నట్లు అల్లు అరవింద్‌ ప్రకటించాడు.

గ్లొబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తో కూడా ఓ సినిమా ఉంబోతుందని తెలుస్తుంది. కన్ఫార్మ్‌ అయిందని చెప్పలేం కానీ దర్శకుడి వేటలో అల్లు అరవింద్‌ ఉన్నాడట. ఇక తమిళ దర్శకుడు మురుగుదాస్‌ కూడా గీతా ఆర్ట్స్‌ లైనప్‌ లో ఉన్నాడు.

గజనీ టైమ్‌ లోనే అల్లు అరవింద్‌.. మురుగుదాస్‌ కు అడ్వాన్స్‌ ఇచ్చినట్లు సమాచారం.  అరవింద్‌ మాత్రం మురుగుదాస్‌ తో గట్టిగానే ఓ సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడు. అది కూడా గజనీ`2 అని టాక్‌. ఇప్పటికే అరవింద్‌ సీక్వెల్‌ కోసం పలు సార్లు అవిూర్‌ ను కలిశాడట. కాగా గజనీ సినిమాను తెలుగు లో అల్లు అరవింద్‌ విడుదల చేశాడు.