బాహుబలి సినిమా కోసం 400 కోట్ల అప్పు
బాహుబలి కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేసినట్లు తెలిపిన రానా
బాహుబలి సినిమా కోసం 400 కోట్లు అప్పు చేశామని రానా దగ్గుబాటి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. నాలుగేళ్ళ క్రితం పెద్ద మొత్తంలో డబ్బు కావాలంటే రెండే ఆప్షన్స్ ఉండేవి. ఒకటి ఆస్తులను తాకట్టు పెట్టడం, లేకుంటే ఎక్కువ రేట్ కు అప్పులు తీసుకోవాలి.
బాహుబలి సినిమా కోసం మేము దాదాపు రూ. 400 కోట్ల అప్పు చేసాం. ఇందుకోసం 24` నుండి 28 శాతం వడ్డీ చెల్లించాము. ఆ సమయంలో నిర్మాతలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు.
ఇది కూడా చదవండి….తండ్రీకూతుళ్ల అనుబంధంతో నాని 30వ సినిమా
బాహుబలి సినిమా సక్సెస్ అయ్యింది కాబట్టి ఆ డబ్బు తిరిగి చెల్లించగలిగాం. ఫెయిల్ అయ్యుంటే ఆ నిర్మాతల పరిస్థితి ఏంటనేది ఊహించుకోవడానికే భయంగా ఉంది. మాకు ఉన్న ఒకే ఒక నమ్మకం రాజమౌళి. ఆయనపైన ఉన్న నమ్మకంతోమే మేమందరం డబ్బు పెట్టుకుంటూ వెళ్లాం అంటూ రానా తెలిపాడు.