Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అనాధ, వృద్ధాశ్రమంలో చేర్చవద్దు

వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులు ఉండకుండా నిర్మూలించాలి. ఆర్డీవో తిప్పే నాయక్.

ధర్మవరం జూన్ 01 (నిజం చెపుతాం) నేటి ప్రపంచంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమైనదని, వృద్ధాశ్రమములో తల్లిదండ్రులను ఉంచకుండా, అదే వృద్ధాశ్రమములను నిర్మూలించినప్పుడే తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన వారము అవుతామని ఆర్డిఓ తిప్పే నాయక్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గురువారం ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా పలు విషయాలను వారు తెలియపరిచారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి తల్లి, తండ్రి తన బిడ్డల పట్ల ప్రేమను మాత్రమే కోరు కుంటారని, కుటుంబంలో కుమారుడు, కుమార్తెలను సమానంగా తల్లిదండ్రులు మాత్రమే చూస్తారని తెలిపారు.

ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు చూపే ప్రేమను కుటుంబములోని బిడ్డలందరూ కూడా గమనిస్తుంటారని, వాటిలో ప్రేమ, ఆప్యాయత, అనురాగాన్ని బిడ్డలు ఆస్వాదించే విధంగా తల్లిదండ్రులు ఉంటారని తెలిపారు. ఇటువంటి లక్షణాలు ఉన్న తల్లిదండ్రుల యొక్క బిడ్డలు కూడా అలవాటు పడడంతో పాటు, కుటుంబంలోని బిడ్డలు పెరిగి పెద్దవారై అమ్మానాన్నల పాత్ర పోషించినప్పుడు, తల్లిదండ్రులను ఆ వృద్ధాప్యంలో ఉన్న వారిని చిన్న పిల్లల వలె చూసుకుంటే, వారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చిన వారమవుతారమని తెలిపారు.

పెద్దల సామెత ప్రకారం మనోవేదనకు మందు లేదు అన్నమాట కు… తల్లిదండ్రులు అనేవారు తిండి, బట్ట, ఏసీ గదులు, విలాసమంతమైనటువంటి సౌకర్యాలు అక్కర్లేదని, కేవలం ప్రేమ, ఆప్యాయత, అనురాగం మాత్రమే వారు కోరుకోవడం వల్ల వారి మనోవేదనకు మందులు పని చేయవని, కేవలం ప్రేమే అనే మందు వల్ల ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. తల్లిదండ్రుల యొక్క బిడ్డలు ప్రతిరోజు ఏదో ఒక సమయాన్ని కేటాయించుకొని ఒక్క పది నిమిషములు వారితో గడిపితే ఆ సంతోషం ఎంత గొప్పదిగా ఉంటుందో మాటల గా చెప్పలేమని తెలిపారు.

ప్రస్తుతం టెక్నాలజీ ప్రకారం వెళితే దూరంగా ఉన్న బిడ్డలు వీడియో కాల్ ద్వారా మాట్లాడితే ఎంతో బాగుంటుందని తెలిపారు.కానీ నేటి సమాజంలో పిల్లలు ను తల్లిదండ్రులు కన్న బిడ్డలుగా చూసుకుంటూ, వారు వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు, ఎటువంటి పరిస్థితుల్లోనూ అనాధ వృద్ధాశ్రమంలో చేర్చకూడదని, అలా చేస్తే అదే పరిస్థితి బిడ్డలకు కూడా వర్తిస్తుందని తెలిపారు.

ఇది కూడా చదవండి….మిషన్ లను తగలబెట్టటానికి వెళుతుండగా…

కావున ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చకుండా, వాటిని పూర్తి దశలో నియంత్రించినప్పుడే తల్లిదండ్రులకు అసలైన మంచి పండుగ రోజు లభిస్తుందని తెలిపారు. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలతో సమానమని, వారి ఆశీస్సులు ఉన్నప్పుడే బిడ్డల యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని తెలిపారు.

కనీ పెంచడంతోపాటు బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అహర్నిశలు శ్రమించే నిత్య కార్మికులు అని, తమలా బిడ్డలు కష్టపూడదనే ఆకాంక్షతో.. కాలు కింద పెట్టనీయకుండా.. అపురూపంగా చూసుకునే అమ్మానాన్నలను… అవసాన దశలో వృద్ధాశ్రమాలకు పరిమితం చేసే నవతరం సంతానం ఇప్పుడు కనిపించడం ప్రపంచీకరణ చేసిన దారుణం అని తెలిపారు.

తల్లిదండ్రులు తమ ఉనికికి రూపం ఇచ్చి, ఉన్నతికి ఉన్నదంతా ధారపోసే తల్లిదండ్రుల రుణం, ఏమిచ్చినా తీర్చుకోలేనిది.. అని, ఉన్నన్నాళ్ళు కంటతడి పెట్టకుండా చూసుకోగలిగితే అదే పదివేలు అనుకునే కన్న వాళ్లకు కొదవ లేదు ఈ లోకంలో అని తెలిపారు.

అమ్మ నాన్నల్లో ఎవరు తక్కువ కాదనే సందేశాన్ని విస్తరింప చేయడమే ఈ తల్లిదండ్రుల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. నేడు దేశంలో ఉన్న వృద్ధాశ్రమాలు అన్నియు కూడా మూతపడ్డ రోజే నిజమైన తల్లిదండ్రుల దినోత్సవం లభిస్తుంది అని తెలిపారు.