Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మిషన్ లను తగలబెట్టటానికి వెళుతుండగా…

మావోయిస్ట్ కొరియర్లు అరెస్ట్.
ములుగు జిల్లా ప్రతినిధి, నిజం చెపుతాం, జూన్ 1:-
ప్రభుత్వ నిషేధిత సి. పి. ఐ మావోయిస్ట్ పార్టీ వాజేడు-వెంకటాపురం ఏరియా కమిటీ సెక్రటరీ అయిన సుధాకర్ కు కొరియర్ లుగా పని చేస్తూ న ముగ్గురు మావోయిస్ట్ లను పోలీస్ లు అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

పోలీసుల తెలిపినా వివరాల ప్రకారం ప్రభుత్వ నిషేధిత సి. పి. ఐ మావోయిస్ట్ లకు అగ్రనాయకులు, దళ సభ్యులు మరియు మరికొంత మంది వాజేడు గ్రామంలో జరిగే రోడ్డు వర్క్ మిషన్ లను తగల బెట్టి, అటుగా వచ్చే పోలీస్ పార్టీని ల్యాండ్ మైన్ పెట్టి చంపాలని కుట్ర పన్నుతున్నారనే ఖచ్చితమైన సమాచారం మేరకు

బుధవారం రాత్రి 9:00 గంటల సమయంలో వెంకటాపురం సి ఐ శివ ప్రసాద్ మరియు వాజేడు ఎస్ఐ రేఖ అశోక్ పోలీస్ సిబ్బంది మరియు సి ఆర్ పి ఎఫ్ 39( C )కంపెనీతో కలిసి వాజేడు నుండి గుమ్మడిదొడ్డి దారిలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, వాజేడు గ్రామ శివారులోని కల్వర్ట్ సమీపంలో నలుగురు వ్యక్తులు పుల్లూరి నాగరాజు S/O రాములు (25),వావిలాల నర్సింగరావు S /O సత్యం( 26),ఏంపెళ్లి జాషువా S /O సత్యం( 26), మోటార్ సైకిల్ మీద ఒక బస్తా మరియు పెట్రోల్ టిన్ తో గుమ్మడిదొడ్డి వైపు నుండి వాజేడు వైపు వస్తూ, పోలీస్ పార్టీని చూసి పారిపోవటానికి ప్రయత్నించగా,

ఇది కూడా చదవండి…బినామీ అనుచరుల పేర్లతో కబ్జా

పోలీస్ వారు వారిని పట్టుకొని వారి వద్ద ఉన్న బ్యాగ్ ని చెక్ చేయగా అందులో కొన్ని ప్రేలుడు పదార్ధాలు ఉండటంతో అనుమానం వచ్చి విచారించగా వారు ముగ్గురు కలిసి ప్రేలుడు సామాగ్రిని తీసుకొని గుమ్మడిదొడ్డిలోని పెట్రోల్ బంక్ కి వెళ్ళి అక్కడ బంక్ ఓనర్ అయిన కంబాలపల్లి గణపతికి కలవగా,

సుధాకర్ ఆదేశాల మేరకు వారి ముగ్గురికి రోడ్డు వర్క్ మిషనరీలను తగలబెట్టటానికి అవసరమయ్యే పెట్రోల్ (10) లీ, మరియు వారి ఖర్చుల నిమిత్తం రూ. 5000/- నగదు యిచ్చి అక్కడి నుండి వారు ముగ్గురు కలిసి వాజేడు వైపు రోడ్డు వర్క్ మిషన్ లను తగలబెట్టటానికి వెళుతుండగా పోలీస్ లు పట్టుకున్నట్టు తెలిపారు.

వారి వద్ద నుండి కార్డెక్స్ వైర్ 5 మీటర్లు, ఒక డిటోనేటరు,పెట్రోల్ టిన్,మ్యాచ్ బాక్స్,మూడు మొబైల్ ఫోన్, రెండు బ్యాటరీలు,ఎలక్ట్రికల్ వైర్ 10 మీటర్లు,మోటార్ సైకిల్ (TS 25 A 7791),టిఫిన్ బాక్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన మావోయిస్టులను, వారికి సహకరించిన పెట్రోల్ బంక్ యజమానిని కేసు నమోదుచేసి కోర్టులో హాజరు పర్చినట్టు పోలీసుల తెలిపారు.