Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బినామీ అనుచరుల పేర్లతో కబ్జా

బినామీ పేర్లతో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి.

ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ .

మహబూబాబాద్, బ్యూరో జూన్ 1 నిజం న్యూస్

బినామీ పేర్లతో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న భూ కబ్జాదారులపై వారి అనుచరులతో పాటు వారికి సహకరిస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కు గురువారం వినతి పత్రం అందజేశారు.

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది .ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వెనుక గల ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 551/1 లో వందల కోట్ల విలువ చేసే సుమారు పది ఎకరాలు కలదు. కొంతమంది భూ మాఫియా దారులు వారి బినామీ అనుచరుల పేర్లతో కబ్జా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అని ఆరోపించారు.

అదే భూమిలో గిరిజన ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ నగర్ అనే పేరుతో నిరుపేద గిరిజన లంబడా ప్రజలకు 8o గజాల భూములో నివాసానికి గుడిసెలు వేసుకోవడానికి వెళ్తే వారిపై రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ప్రవేశించినందుకు 55 నెంబర్ గల నోటీసు ఇచ్చి స్థానిక మహబూబాబాద్ తహసిల్దార్ బైండోవర్ చేయడం జరిగింది అని తెలిపారు.

ఇది కూడా చదవండి….మా వారి జోలికి వస్తే క్రేన్ కు ఉరితీస్తా

ఈ భూమి విషయంలో గతంలో బాలాజీ కుమార్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా, రిట్ పిటిషన్ నెంబర్ 45131/2022, మరొక రిట్ పిటిషన్ నెంబర్3132/2023, లలో హైకోర్టు అట్టి పిటిషన్లను తిరస్కరిస్తూ స్థానిక తహసిల్దార్ కు ప్రభుత్వ భూములను సర్వేనెంబర్ 551/1 లోపల ప్రైవేట్ వ్యక్తులను ఆక్రమించకుండా తగు చర్యలు తీసుకోవాలని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది.

అయినా కూడా అదే ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 551 /1 లో అక్రమంగా ప్రవేశించి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికి డోజర్లతో చదును చేస్తూ ఈ భూమి తమది అని బహిరంగంగా బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంలో మాత్రం రెవెన్యూ అధికారులు వారు ఇచ్చే మామూళ్లకు కక్కుర్తి పడి చూసి చూడకుండా వదిలేస్తూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతానికి గురి చేస్తున్నారు.

ఈ విషయంపై లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రభుత్వ భూములు ఏర్పాటు చేసిన బోర్డును వెంటనే తొలగించి ,ఆ బోర్డు ఏర్పాటు చేసిన వారితోపాటు వారికి సహకరిస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకొని, అట్టి ప్రభుత్వ భూమిలో తహసిల్దార్ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను కోరామని రమేష్ నాయక్ తెలిపారు.

లేనిచో రాబోయే రోజులలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ, కలెక్టర్ కార్యాలయం ముట్టడికి కార్యక్రమం చేపడుతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ శీను నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు భూక్య బాలాజీ నాయక్, జిల్లా కార్యదర్శి డి శ్రీను నాయక్, టౌన్ అధ్యక్షులు బానోతు సిద్దు నాయక్, మహబూబాబాద్ మండల అధ్యక్షులు రమేష్ నాయక్, జిల్లా యువజన అధ్యక్షులు ధరావత్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.