ఆర్థిక సాయం అందజేస్తుంది రాష్ట్ర మునిసిపల్ శాఖ

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి సూచనల మేరకు హైదరాబాద్, పరిసరాల్లో వరద బాధిత ప్రాంతాల్లోని 3-4 లక్షల కుటుంబాలకు ఈరోజు నుండి రు.10,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తుంది రాష్ట్ర మునిసిపల్ శాఖ.

బాధిత కుటుంబాలకు వారి ఇంటివద్దనే ఈ ఆర్థిక సహాయం అందజేస్తారు. అవసరమైతే ఈ సహాయం ఇంకా పెంచడానికి కూడా సిద్ధమని, వర్షాల వల్ల ఇబ్బందిపడ్డ ప్రతి వ్యక్తికి/కుటుంబానికి ఈ సాయం అందాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.

ఈ విపత్కర సమయంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ లు, ఎన్జీవోలు కలిసికట్టుగా ప్రజలకు సాయం అందేటట్టు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి.