Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

స్పైడర్‌ మ్యాన్‌ సినిమాకు గిల్‌ వాయిస్‌ ఓవర్‌

మైదానంలో చిరుతలా చెలరేగే శుభ్‌మన్ గిల్ కు  ఇష్టమైన సినిమా  స్పైడర్‌ మ్యాన్‌. తనకు ఎంతో ఇష్టమైన ఈ సినిమాకు గిల్‌ ఈమధ్యే వాయిస్‌ ఓవర్‌ చెప్పాడు. నేను చిన్నప్పుడు చూసిన మొదటి సూపర్‌ హీరో సినిమా స్పైడర్‌ మ్యాన్‌.

అందుకే నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం. ఈ మూవీకి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది’ అని ఈ యంగ్‌ ఓపెనర్‌ చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి…..ఆ బంతిని కూడా యార్కర్‌ వేద్దామనుకున్నా…. మిస్‌ అయింది

భారతీయ భాషల్లో వస్తున్న స్పైడర్‌ మ్యాన్‌ అక్రాస్‌ ది స్పైడర్‌ వర్సే యానిమేటెడ్‌ సినిమాకు గిల్‌ వాయిస్‌ ఓవర్‌ చెప్పాడు. స్పైడర్‌ మ్యాన్‌ పవిత్ర ప్రభాకర్‌ పాత్రకు హిందీ, పంజాబీ భాషల్లో గిల్‌ గాత్ర దానం చేశాడు.

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో చెలరేగి ఆడిన శుభ్‌మన్‌ గిల్‌ ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. డిఫెండిరగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌ చేరడంలో గిల్‌ కీలక పాత్ర పోషించాడు. మూడు సెంచరీలతో కదం తొక్కిన ఈ యంగ్‌స్టర్‌ పదహారో సీజన్‌లో పలు రికార్డులు నెలకొల్పాడు.