Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆ బంతిని కూడా యార్కర్‌ వేద్దామనుకున్నా…. మిస్‌ అయింది

ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఫైనల్లో ఆఖరి ఓవర్ వేసిన  గుజరాత్‌ టైటాన్స్‌ పేసర్‌ మోహిత్‌ శర్మ ఆ రోజును అంత తొందరగా మర్చిపోయేలా లేడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు.

ఫైనల్‌ మ్యాచ్‌ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నాలుగు బంతులు యార్కర్లు వేసిన నేను ఆఖరి రెండు బంతులు ఎందుకు వేరేగా వేశాను అని రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నా.

ఈ సీజన్‌ ఆసాంతం నేను అద్భుతంగా బౌలింగ్‌ చేశా. అదే కాన్ఫిడెన్స్‌తో ఆఖరి ఓవర్లో నాలుగు యార్కర్లు వేశాను. ఆ తర్వాత బంతి కూడా యార్కర్‌ వేద్దామనుకున్నా. కానీ, మిస్‌ అయింది. జడేజా దాన్ని సిక్సర్‌గా మలిచాడు’ అని మోహిత్‌ తెలిపాడు.

ఇది కూడా చదవండి……కప్పు కొట్టాలన్న కసితో భారత్‌

క్వాలిఫైర్- 2లో ముంబైపై 5 వికెట్లు తీసిన మోహిత్‌ శర్మ ఆఖరి ఓవర్‌ వేసేందుకు సిద్ధమయ్యాడు. దాంతో, చెన్నై విజయం అసాధ్యమే అనుకున్నారంతా. అయితే.. మోహిత్‌ శర్మతో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మాట్లాడాడు. దాంతో చక్కగా బౌలింగ్‌ చేస్తున్న అతడిని అనవసరంగా పాండ్యా డిస్టర్బ్‌ చేశాడని మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, సునీల్‌ గావస్కర్‌ విమర్శించారు.

తొలి నాలుగు బంతులకు నాలుగు పరుగులే ఇచ్చాడు. ఆ తర్వాత పాండ్యా వచ్చి మోహిత్‌కు ఏదో చెప్పాడు. ఆ తర్వాత బంతిని జడ్డూ స్టాండ్స్‌లోకి పంపాడు.

ఆఖరి బాల్‌కు పైన్ లెగ్‌లో బౌండరీ బాదాడు. దాంతో, చెన్నై ఐదోసారి ఐపీఎల్‌ చాంపియన్‌గా అవతరించింది. ఐదు ట్రోఫీలు సాధించిన ముంబై ఇండియన్స్‌ రికార్డును సమం చేసింది.