Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కప్పు కొట్టాలన్న కసితో భారత్‌

రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరిన భారత్‌ టెస్టు గదపై గురి పెట్టింది.

ఇంగ్లండ్‌లోని ఓవల్‌ స్టేడియం వేదికగా జూన్‌ 7 -11 తేదీల్లో భారత్‌, ఆస్టేల్రియా మధ్య టెస్టు చాంపియన్‌షిప్‌ జరగనుంది. 2021లో ఫైనల్‌ చేరిన భారత్‌ ఆఖరి మెట్టుపై భంగపడింది.

ఇది కూడా చదవండి…భవిష్యత్తులో భారత జట్టులో గైక్వాడ్‌కు అవకాశం

విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా న్యూజిలాండ్‌ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. దాంతో, టీమిండియా ఈసారి కప్పు కొట్టాలనే కసితో ఉంది.

తొలిసారి ఫైనల్‌ చేరిన ఆసీస్‌ కూడా విజయంపై కన్నేసింది. స్వదేశంలో జరిగిన బోర్డర్‌ `గవాస్కర్‌ ట్రోఫీలో 4-2తో కంగారులను చిత్తు చేసిన రోహిత్‌ సేన అదే ఫలితాన్ని పునరావృతం చేస్తుందా? లేదా? అనేది మరో వారం రోజుల్లో తేలిపోనుంది.