Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భవిష్యత్తులో భారత జట్టులో గైక్వాడ్‌కు అవకాశం

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ ప్రశంసలు
లాహోర్‌,జూన్‌1 : చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు ఉజ్వల భవిష్యత్ ఉందని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ ప్రశంసించారు.

ఐపీఎల్‌ 2023లో గైక్వాడ్‌ మొత్తం 590 పరుగులతో విజయవంతమైన సీజన్‌ను ముగించాడని వసీం వెల్లడించారు.

ఫైనల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్‌ వేగంగా 26 పరుగులు చేసి ఛేజింగ్‌లో తన జట్టుకు మంచి ప్రారంభాన్ని అందించాడు.

ఇది కూడా చదవండి….పాక్‌ లేకుండానే ఆసియాకప్‌…?

ఐపీఎల్‌లో  మొత్తం నిలకడగా బ్యాటింగ్‌ చేశాడని, భవిష్యత్తులో భారత జట్టులో మంచి అవకాశం రానుందని ఆయన తెలిపారు.

ఒత్తిడిలో కూడా  గైక్వాడ్‌ అద్భుతమైన ఆట తీరును కనబర్చారని, అతను ఫిజికల్‌గా చాలా ఫిట్‌గా ఉండటం ప్లస్‌ అయిందన్నారు. అతను చాలా మంచి ఫీల్డర్‌ అని, భారత క్రికెట్‌తో పాటు అతను ఆడే ఫ్రాంచైజీల విషయానికి వస్తే గైక్వాడ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని అక్రమ్‌ అన్నారు.