Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పాక్‌ లేకుండానే ఆసియాకప్‌…?

ఆసియాకప్‌ నుంచి పాక్‌ నిష్కమ్రణ?
తాజా పరిస్థితుల్లో పాక్‌ లేకుండానే టోర్నీ
ఆసియా కప్‌ టోర్నీకి పాక్‌ దూరం కానుందా…అవుననే సంకేతాలు వస్తున్నాయి. పాక్ పాల్గొనకుంటే భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అప్గానిస్తాన్‌, నేపాల్‌.. మాత్రమే ఈ టోర్నీలో తలపడే అవకాశం ఉంది.

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ప్రతిపాదించిన హైబ్రిడ్‌ మోడల్‌ను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఏసీసీ), బిసిసిఐ తిరస్కరించినట్టు సమాచారం. అదే జరిగితే వైదొలగడం మినహా పాకిస్థాన్‌కు మరో మార్గం లేదు.

హైబ్రిడ్‌ మోడల్‌ ప్రకారం.. భారత్‌ ఆడబోయే మ్యాచులు దుబాయ్‌లో ఆడాల్సి ఉంటుంది. అయితే సెప్టెంబర్‌లో దుబాయ్‌లో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. కాబట్టి అక్కడి వాతావరణంతో ఆడటం కష్టం. అందువల్ల పీసీబీ ప్రతిపాదనకు ఏసీసీ అంగీకారం తెలపలేదని సమాచారం.

ఇది కూడా చదవండి…మఠంపల్లిలో రాష్ట్ర స్థాయి జూనియర్ రగ్బీ పోటీలు

పాక్‌ మినహా మిగిలిన అన్ని దేశాలు కాంటినెంటల్‌ టోర్నమెంట్‌ ఆడటానికి అంగీకరించినట్లు కథనాలు వస్తున్నాయి.

శ్రీలంక వేదికగా ఈ టోర్నీ జరగనున్నట్లు తెలుస్తోంది. తరువాత జరగబోయే ఏసీసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశంలో పాక్‌ మినహా సభ్య దేశాలన్నీ శ్రీలంకలో ఆసియా కప్‌ ఆడేందుకు ఏకగ్రీవంగా అంగీకరించనున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ పాక్‌ ఈ టోర్నీ నుంచి తప్పుకుంటే ఐసీసీ వరల్డ్‌ కప్‌ 2023 నుంచి వైదొలిగే అవకాశాలు ఉన్నాయి. అది ఒక రకంగా పాక్‌కు నష్టం కలిగించేదే అయినా.. టోర్నీ కల తప్పనుంది.

భారత్‌ ` పాక్‌ మ్యాచులకు ఎంత క్రేజ్‌ ఉంటుందో అందరికీ విదితమే. మరోవైపు పాక్‌.. ఆసియా కప్‌లో ఆడకుంటే అదే సమయంలో సౌతాఫ్రికా, జింబాబ్వేతో కలిసి ట్రై సిరీస్‌ నిర్వహించాలని చూస్తోంది. ఆ మేరకు ఇప్పటికే ఇరు దేశాలతో చర్చలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.